Osmania University: ఓయూ రీసెర్చ్.. 500గ్రాముల బ్యాటరీతో ఆర్టిఫిషియల్ హార్ట్

ఆర్టిఫిషియల్ హార్ట్ మేకింగ్‌పై ఉస్మానియా యూనివర్సిటీ ఫోకస్ పెట్టింది. ఇంజనీరింగ్‌ కాలేజీలోని సెంటర్‌ ఫర్‌ ప్రొడక్ట్‌ డిజైన్‌ డెవలఫ్‌మెంట్‌ ఆడిటివ్‌ మేనేజ్‌మెంట్‌, ఉస్మానియా మెకానికల్‌ ఇంజినీరింగ్‌..

Osmania University: ఓయూ రీసెర్చ్.. 500గ్రాముల బ్యాటరీతో ఆర్టిఫిషియల్ హార్ట్

Artificial Heart (1)

Osmania University: ఆర్టిఫిషియల్ హార్ట్ మేకింగ్‌పై ఉస్మానియా యూనివర్సిటీ ఫోకస్ పెట్టింది. ఇంజనీరింగ్‌ కాలేజీలోని సెంటర్‌ ఫర్‌ ప్రొడక్ట్‌ డిజైన్‌ డెవలఫ్‌మెంట్‌ ఆడిటివ్‌ మేనేజ్‌మెంట్‌, ఉస్మానియా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాలు సంయుక్తంగా ఈ స్టడీ నిర్వహిస్తున్నాయి. త్రీడీ ప్రింటింగ్‌ టెక్నికల్ నాలెడ్జ్‌తో ఇప్పటికే ఎముకలు, దంతాలు, మోకాలి చిప్పలు, ఏరోస్పేస్, ఆటోమొబైల్‌ వస్తువుల తయారీలో ఎక్స్‌పీరియెన్స్‌డ్ రీసెర్చర్స్.. ఫ్రెష్‌గా ఆర్టిఫిషియల్ హార్ట్ మేకింగ్‌పై దృష్టి సారించారు.

హార్ట్ షేప్ డిజైనింగ్‌కు సంబంధించిన కార్యకలాపాలు ఇప్పటికే 50 శాతం పూర్తి చేశారు. మరో 6 నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. రీసెర్చర్లు తయారుచేసిన గుండె పనితీరును ముందుగా జంతువులపై ప్రయోగించనున్నారు. ఆశించిన ఫలితాలు వచ్చిన తర్వాతే మనుషులకు అమర్చాలని అనుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ హార్ట్ డిజైనింగ్ రీసెర్చ్ లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ శ్రీరామ్‌ వెంకటేశ్‌ నేతృత్వంలో జరుగుతున్న ఈ పరిశోధనలో డాక్టర్‌ ఎల్‌.శివరామకృష్ణ, డాక్టర్‌ మధుసూదన్‌రాజు సహా మరో ముగ్గురు రీసెర్చ్ స్టూడెంట్స్ పాల్గొంటున్నారు.

ఇప్పటికే అమెరికాలో ఆర్టిఫిషియల్ హార్ట్ తయారు చేశారు. దీనికి అమర్చిన బ్యాటరీ బరువు రెండున్నర కేజీలకుపైగా ఉంది. బ్యాటరీ బరువును 500 గ్రాములకు తగ్గించారు. గుండెకు సమీపంలో ఛాతీ లోపలే బ్యాటరీ అమర్చే వెసులుబాటును కల్పించేలా దీన్ని రెడీ చేస్తున్నారు.

‘రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్ష అభియాన్‌ (రూసా) ప్రాజెక్టు ద్వారా వచ్చిన రూ.5.5 కోట్లతో వర్సిటీలో ఈ సీపీడీడీఏఎం అభివృద్ధి చేశాం. సహజమైన గుండె పనితీరుకు ఏ మాత్రం తీసి పోనివిధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నాం. కేబుల్‌తో పనిలేకుండా ఛాతీ లోపల ఉన్న బ్యాటరీనీ ఎప్పుడంటే అప్పుడు రీచార్జి చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. హార్ట్‌పైనే కాకుండా లివర్, ఊపిరితిత్తులపై కూడా రీసెర్చ్‌లు చేస్తున్నాం’ అని ప్రొఫెసర్స్ అంటున్నారు.