Yuvraj Singh : తండ్రి అయిన యువరాజ్ సింగ్

తమకు పండంటి మగ బిడ్డకు జన్మించాడని, కుటుంబసభ్యులు, అభిమానులు, స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Yuvraj Singh : తండ్రి అయిన యువరాజ్ సింగ్

Yuvaraj

Yuvraj Singh – Hazel Keech : టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి హేజల్ కేచ్..పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా..వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో యువీ – హేజల్ దంపతులకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. తమకు పండంటి మగ బిడ్డకు జన్మించాడని, కుటుంబసభ్యులు, అభిమానులు, స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నామన్నారు. తమ ప్రైవసీకి ఎలాంటి భంగం కలిగించకూడదని కోరుకుంటున్నట్లు యువరాజ్ ట్వీట్ లో తెలిపారు. ఇదే పోస్టును హేజల్ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేశారు. 2016లో యువరాజ్ సింగ్ – హేజల్ లకు వివాహమైంది. హేజల్ బ్రిటీష్ – మారిషియస్ నటి. ఇటీవలే వీరు ఐదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.

Read More : CM KCR : 33 జిల్లాలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను నియమించిన సీఎం కేసీఆర్

ఇక యువీ విషయానికి వస్తే..భారత జట్టులో ఆల్ రౌండర్ గా పేరు గడించాడు. అటు బౌలర్..ఇటు బ్యాటింగ్ లో సత్తా చాటాడు. 2000 సంవత్సరంలో కెన్యాతో జరిగిన మ్యాచ్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగు పెట్టిన యూవీ…అనతికాలంలోనే స్టార్ ఆటగాడిగా వెలుగొందాడు. 2019 జూన్ 10వ తేదీన అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. టీమిండియా తరపున ఇతను 304 వన్డేలు, 40 టెస్టులు, 58 టీ 20 మ్యాచ్ లు ఆడాడు. వన్డేలో 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలతో 8 వేల 701 పరుగులు, టీ 20లో 8 హాఫ్ సెంచరీలతో 1177 రన్లు, టెస్టుల్లో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలతో 1900 పరుగులు చేశాడు. 2007 టీ 20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచ కప్ లో ఆడాడు. 2011లో క్యాన్సర్ ట్రీట్ మెంట్ తర్వాత ఫామ్ కోల్పోయాడు. చివరగా 2017లో వెస్టిండీస్ తో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2012లో అర్జున అవార్డు, 2014లో పద్మశ్రీ పురస్కారం లభించాయి.