అస్గర్ ఆఫ్ఘన్ పై వేటు.. కెప్టెన్సీ నుంచి తొలగింపు

2019 ఐసీసీ ప్రపంచ కప్ కు ముందుగానే ఆప్ఘానిస్థాన్ కెప్టెన్ అస్గర్ ఆప్ఘన్ పై వేటు పడింది. ఆప్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు అస్గర్ ను మూడు ఫార్మాట్ల మ్యాచ్ ల్లో జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించింది.

  • Published By: sreehari ,Published On : April 5, 2019 / 09:58 AM IST
అస్గర్ ఆఫ్ఘన్ పై వేటు.. కెప్టెన్సీ నుంచి తొలగింపు

2019 ఐసీసీ ప్రపంచ కప్ కు ముందుగానే ఆప్ఘానిస్థాన్ కెప్టెన్ అస్గర్ ఆప్ఘన్ పై వేటు పడింది. ఆప్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు అస్గర్ ను మూడు ఫార్మాట్ల మ్యాచ్ ల్లో జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించింది.

2019 ఐసీసీ ప్రపంచ కప్ కు ముందుగానే ఆప్ఘానిస్థాన్ కెప్టెన్ అస్గర్ ఆప్ఘన్ పై వేటు పడింది. ఆప్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు అస్గర్ ను మూడు ఫార్మాట్ల మ్యాచ్ ల్లో జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించింది. అస్గర్ కెప్టెన్సీలో ఐర్లాండ్ తో జరిగిన మూడు మ్యాచ్ ల్లో అప్ఘాన్ విజయం సాధించినప్పటికీ అస్గర్ ను కెప్టెన్సీ నుంచి బోర్డు తప్పించడం అందరని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వన్డే, టీ20, టెస్టు మ్యాచ్ లకు అస్గర్ స్థానంలో గులాబ్దిన్ నాబ్‌, రషీద్ ఖాన్, రెహమత్ షా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మూడు ఫార్మాట్లకు ఆఫ్ఘన్ జట్టు నుంచి రషీద్, షఫీకుల్లా షాఫిక్, హస్మతుల్లా షాహిదీలను వైస్ కెప్టెన్లుగా బోర్డు ప్రకటించింది.
Read Also : గేల్ తో సెల్ఫీ దిగిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?

28ఏళ్ల నయిబ్ ఆల్ రౌండర్ ఆప్ఘానిస్థాన్ జట్టును లీడ్ చేయనున్నాడు. మే30 నుంచి యూకేలో ఆరంభం కానున్న వన్డే ప్రపంచ కప్ లో ఆప్ఘన్ జట్టుకు నాబ్‌ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మూడు ఫార్మాట్లకు కెప్టెన్ లు నియమించిన కొత్త ఆటగాళ్లలో రిషీద్ ఒక్కడికే జాతీయ స్థాయిలో కెప్టెన్సీ అనుభవం ఉంది. బౌలర్, ఆల్ రౌండర్ గా రిషీద్ ఆఫ్ఘానిస్థాన్ తరపున తన కెప్టెన్సీలో నాలుగు వన్డే మ్యాచ్ లు ఆడాడు. 

2015 ఏప్రిల్ లో అస్గర్ ఆప్ఘానిస్థాన్ జట్టు కెప్టెన్ గా ఎంపిక అయ్యాడు. ఆల్ రౌండర్ మహ్మద్ నబీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను అస్గర్ తీసుకున్నాడు. అస్గర్ సారథ్యంలో ఆప్ఘాన్ జట్టు 31 వన్డేల్లో విజయం సాధించగా.. 46 టీ20 మ్యాచ్ ల్లో 37 విజయాలు అందించాడు. 2019 ఏడాదిలో ఐర్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో కూడా ఆప్ఘాన్ కెప్టెన్ గా కీలక పాత్ర పోషించాడు. 2009 నుంచి ఆప్ఘాన్ జట్టు తరపున ఆడుతున్న అస్గర్ తన కెరీర్ లో 2013లో వన్డేలు, టీ20 మ్యాచ్ ల్లో కలిపి మొత్తం 1056 పరుగులు సాధించాడు. వచ్చే మే నెలలో అప్ఘాన్.. స్కాట్ లాండ్, ఐర్లాండ్ జట్లతో తలో రెండు వన్డే మ్యాచ్ లు ఆడనుంది.