IPL 2022: లక్ష మంది నోట.. ఒకే ఒక్క పాట “వందేమాతరం”

రెహమాన్ సంగీత తరంగం నుంచి వస్తున్న పాటకు వంత పాడుతూ లక్ష మందికి పైగా అభిమానులు అదే పాటను ఆలపిస్తుంటే అక్కడ ఉన్నవాళ్లకే కాదు.. టీవీలో చూస్తున్న వాళ్లకూ వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి.

IPL 2022: లక్ష మంది నోట.. ఒకే ఒక్క పాట “వందేమాతరం”

Ipl 2022

IPL 2022: రెండున్నర నెలలుగా క్రీడాభిమానుల్ని అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 15వ సీజన్ అద్భుతమైన వేడుకగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టేడియానికి రాగా, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫైనల్ ఈవెంట్ వేడుకలకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్, బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ విచ్చేశారు.

అద్భుతమైన వేడుకలో జై హో.., రంగ్ దే బసంతీ లాంటి సూపర్బ్ సాంగ్స్ అందించిన ఏఆర్ రెహమాన్ వందేమాతరం సాంగ్ కంపోజ్ చేశారు. అంతేకాదు.. రెహమాన్ సంగీత తరంగం నుంచి వస్తున్న పాటకు వంత పాడుతూ లక్ష మందికి పైగా అభిమానులు అదే పాటను ఆలపిస్తుంటే అక్కడ ఉన్నవాళ్లకే కాదు.. టీవీలో చూస్తున్న వాళ్లకూ వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి.

రహమాన్ పర్‌ఫార్మెన్స్ కంటే ముందు బాలీవుడ్ యాక్టర్ రణవీర్ సింగ్.. హిందీ పాటలకు డ్యాన్స్ వేసి అలరించాడు. ఆ తర్వాత ఇండియన్ క్రికెట్ అతిపెద్ద జెర్సీ లాంచ్ చేయనుందని రవిశాస్త్రి అనౌన్స్ మెంట్ తో వేడుకలు ముగిశాయి. కొవిడ్ మహమ్మారి ముందు లక్ష మంది కెపాసిటీతో నిర్మించిన అతిపెద్ద స్టేడియమైన నరేంద్ర మోదీ స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది.

Read Also: ఐపీఎల్‌ ఫైనల్ వేడుకలో అతిపెద్ద జెర్సీ లాంచ్

రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 130 పరుగులు చేయగలిగింది. గుజరాత్.. 18.1 ఓవర్‌లోనే టార్గెట్‌ను ఛేదించేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ పెర్‌ఫార్మెన్స్ మ్యాచ్‌ను గెలిపించింది. మ్యాచ్ విన్నర్‌కు 20 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ, ట్రోఫీ అందించారు. రన్నరప్‌‌గా నిలిచిన పింక్ టీమ్‌ 13.5 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీతో సరిపెట్టుకుంది.