WTC Final 2023: అంద‌రూ ఐపీఎల్ ఆడుతుంటే.. అత‌డు మాత్రం డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ కోసం ఇంగ్లాండుకు

భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జూన్ 7 నుంచి 11 వరకు లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.ఇందుకు ఇంకా చాలా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ అక్క‌డి ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న కోసం ఆసీస్ ఆట‌గాడు ల‌బుషేన్ ఇంగ్లాండ్‌కు ప‌య‌నం అయ్యాడు.

WTC Final 2023: అంద‌రూ ఐపీఎల్ ఆడుతుంటే.. అత‌డు మాత్రం డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ కోసం ఇంగ్లాండుకు

Marnus Labuschagne

WTC Final 2023: ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL)లో చాలా మంది అంతర్జాతీయ ఆటగాళ్లు బిజీగా ఉన్నారు. అయితే.. అంద‌రూ ఐపీఎల్ ఆడుతున్న స‌మ‌యంలో ఓ క్రికెట‌ర్ మాత్రం ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ పైన‌ల్‌ (WTC Final), యాషెస్‌(Ashes) సిరీస్‌ల‌లో రాణించాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. ఆ సిరీస్‌ల‌కు చాలా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ నేడు ఇంగ్లాండ్‌కు ప‌య‌నం అయ్యాడు. అత‌డే ఆస్ట్రేలియా కీల‌క ఆట‌గాడు మార్న‌స్ ల‌బుషేన్‌(Marnus Labuschagne).

భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జూన్ 7 నుంచి 11 వరకు లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అనంత‌రం జూన్ 16 నుంచి ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్‌తో ప్ర‌తిష్టాత్మ‌క యాషెస్ సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీస్‌ల స‌న్న‌ద్ద‌త కోసం ల‌బుషేన్ బుధ‌వారం ఇంగ్లాండ్ ప‌య‌నం అయ్యాడు.

IPL 2023, CSK vs RR: చెపాక్‌లో గ‌ర్జించేది ఎవ‌రో..? హెడ్ టూ హెడ్ రికార్డు ఇదే

ఇంగ్లాండ్‌లోని వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అల‌వాటు ప‌డ‌డంతో పాటు అక్క‌డి పిచ్‌ల‌పై అవ‌గాహ‌న పెంచుకునేందుకు ల‌బుషేన్ వెళ్లాడు. ఇందుకోసం స్థానిక క్ల‌బ్ అయిన గ్లామోర్గాన్‌తో గ‌త సంవ‌త్స‌రం ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందం మేర‌కు 2024 వ‌ర‌కు అత‌డు క్ల‌బ్ త‌రుపున ఆడ‌నున్నాడు. రేప‌టి(గురువారం) నుంచి కౌంటీ ఛాంపియన్‌షిప్ ప్రారంభం కానుంది.ఈ ఛాంపియ‌న్ షిప్‌లో గ్లామోర్గాన్‌కు ల‌బుషేన్ ఆడ‌నున్నాడు.

28 ఏళ్ల ల‌బుషేన్ ప్ర‌స్తుతం ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 ర్యాంక్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా త‌రుపున 37 టెస్టులు ఆడిన ల‌బుషేన్ 3,394 ప‌రుగులు చేశాడు. ఇందులో 10 శ‌త‌కాలు, 15 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.

IPL 2023: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి రికార్డును బ‌ద్ద‌లు కొట్టేది అత‌డే : ర‌విశాస్త్రి