Australia Cricketer: కొవిడ్ పాజిటివ్ అయినప్పటికీ ఫైనల్‌ మ్యాచ్‌కు మహిళా క్రికెటర్

క్రికెట్ ఆస్ట్రేలియా కొవిడ్ పాజిటివ్ వచ్చిన ప్లేయర్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఓకే చెప్పింది. ఇండియాతో ఆడుతున్న గోల్డ్ మెడల్ మ్యాచ్ కు ముందు తహిలా మెక్‌గ్రాత్ కు కొవిడ్ నిర్వహించగా పాజిటివ్ వచ్చింది.

Australia Cricketer: కొవిడ్ పాజిటివ్ అయినప్పటికీ ఫైనల్‌ మ్యాచ్‌కు మహిళా క్రికెటర్

 

 

Australia Cricketer: క్రికెట్ ఆస్ట్రేలియా కొవిడ్ పాజిటివ్ వచ్చిన ప్లేయర్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఓకే చెప్పింది. ఇండియాతో ఆడుతున్న గోల్డ్ మెడల్ మ్యాచ్ కు ముందు తహిలా మెక్‌గ్రాత్ కు కొవిడ్ నిర్వహించగా పాజిటివ్ వచ్చింది.

“కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్‌ RACEG (రిజల్ట్స్ అనాలసిస్ క్లినికల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్)ను సీజీఏ క్లినికల్ స్టాఫ్ సంప్రదించింది. మెక్ గ్రాత్ ఈ రోజు ఇండియాతో జరిగే ఫైనల్ లో ఆడనున్నారు” అని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.

ఆదివారం స్వల్ప లక్షణాలతో కనిపించారని టీమ్ మేనేజ్మెంట్ తెలపగా జరిపిన కొవిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. ఐసీసీ నుంచి అప్రూవల్ పొందిన తర్వాత ఆడేందుకు ఎట్టకేలకు తుది జాబితాలో స్థానం దక్కించుకున్నట్లు టాస్ సమయంలో వెల్లడించారు.

Read Also: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‎కు స్వర్ణపతకాల మోత

“సీజీఎఫ్, ఐసీసీ, సీజీఏ, క్రికెట్ ఆస్ట్రేలియా మెడికల్ స్టాఫ్ సమగ్ర ప్రొటోకాల్ లను అమలు చేశారు. ఫలితంగా మ్యాచ్ అనంతరం కూడా ప్లేయర్లకు వ్యాప్తి కలగకుండా ఉంటుంది” అని తెలిపారు.