WTC Final 2023: టీమ్ఇండియాకు క‌ష్ట‌మే.. ఆస్ట్రేలియా జ‌ట్టు ఇదే.. నాలుగేళ్ల త‌రువాత ఆ ఆల్‌రౌండ‌ర్ చోటు

క్రికెట్ అభిమానులు ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌(WTC) ఫైన‌ల్ మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 7 నుంచి 11 వ‌ర‌కు లండ‌న్‌లోని ఓవ‌ల్ మైదానంలో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

WTC Final 2023: టీమ్ఇండియాకు క‌ష్ట‌మే.. ఆస్ట్రేలియా జ‌ట్టు ఇదే.. నాలుగేళ్ల త‌రువాత ఆ ఆల్‌రౌండ‌ర్ చోటు

Australia

WTC Final 2023: క్రికెట్ అభిమానులు ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌(WTC) ఫైన‌ల్ మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 7 నుంచి 11 వ‌ర‌కు లండ‌న్‌లోని ఓవ‌ల్ మైదానంలో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచ్ కోసం మైదానాన్ని సిద్దం చేస్తున్నారు. భార‌త ఆట‌గాళ్లు ప్ర‌స్తుతం ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో బిజీగా ఉండ‌గా.. క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్ పై దృష్టి పెట్టింది. ఏకంగా జ‌ట్టునే ప్ర‌క‌టించింది.

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌తో పాటు ఆ త‌రువాత ఇంగ్లాండ్ జ‌ట్టుతో జ‌ర‌గ‌నున్న యాషెస్ సిరీస్‌లోని తొలి రెండు టెస్టుల‌కు 17 మందితో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది. గ‌త కొన్నాళ్లుగా జ‌ట్టుకు దూరంగా ఉన్న‌ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ తో పాటు జోష్ ఇంగ్లిస్, మార్కస్ హారిస్‌లు చోటు ద‌క్కించుకున్నారు. నాలుగు సంవ‌త్స‌రాల త‌రువాత మార్ష్‌కు టెస్టు జ‌ట్టులో స్థానం ద‌క్కింది. అయితే.. గత కొంత‌కాలంగా టెస్టుల్లో పేలవ ఫామ్‌తో ఇబ్బంది ప‌డుతున్న ఓపెన‌ర్ వార్న‌ర్ కు సైతం చోటు ద‌క్క‌డం కొంత ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. వార్న‌ర్ అనుభ‌వం దృష్ట్యా సెల‌క్ట‌ర్లు మ‌రో అవ‌కాశం ఇచ్చారు. ఈ మ్యాచుల్లో సైతం వార్న‌ర్ విఫ‌ల‌మైతే అత‌డి టెస్టు కెరీర్ ప్ర‌మాదంలో ప‌డిన‌ట్లే.

WTC Final 2023: అంద‌రూ ఐపీఎల్ ఆడుతుంటే.. అత‌డు మాత్రం డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ కోసం ఇంగ్లాండుకు

17 మందితో కూడిన ఆస్ట్రేలియా జ‌ట్టు ఇదే

పాట్ కమ్మిన్స్ (కెప్టెన్‌), జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, టోడిఫై మార్ష్, మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్‌ ), మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా ప్ర‌క‌టించిన జ‌ట్టులోని చాలా మంది ఆట‌గాళ్లు ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్నారు. ఇక భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు మే మొద‌టి వారంలో డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్ కోసం భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

India enter WTC final-2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరిన టీమిండియా