WTC Final 2023: ఈ ఇద్దరు టీమ్ఇండియా ఆటగాళ్లపైనే ఆస్ట్రేలియా దృష్టంతా
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా జట్టు ఇద్దరు టీమ్ఇండియా ఆటగాళ్లపైనే ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉందన్నాడు.

Ricky Ponting names two Indian players
WTC Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. జూన్ 7 నుంచి 11 వరకు లండన్‌లోని ఓవల్ వేదికగా భారత్(Team India), ఆస్ట్రేలియా(Australia) జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియాలు 15 మందితో కూడిన జట్లను ఎంపిక చేశాయి. లండన్‌కు చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌ను మొదలుపెట్టేశాయి. ప్రత్యర్థిని ఎలా నిలువరించాలనే దానిపై ఎవరి వ్యూహాలను వారు రూపొందించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా జట్టు ఇద్దరు టీమ్ఇండియా ఆటగాళ్లపైనే ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉందన్నాడు. ఇందుకు ఆ ఇద్దరు ఆటగాళ్లకు ఆసీస్‌పై మెరుగైన రికార్డు ఉండడమే కారణమని చెప్పుకొచ్చాడు. ఆ ఇద్దరు కీలక ఆటగాళ్లు ఎవరో కాదు ఒకరు పరుగుల యంత్రం విరాట్ కోహ్లి కాగా మరొకరు నయా వాల్ పుజరాలే. వీరిద్దరిని ఎంత త్వరగా ఔట్ చేస్తే ఆసీస్‌కు అంత ఎక్కువగా విజయావకాశాలు ఉంటాయి.
Team India New Jersey: టీమ్ఇండియా కొత్త జెర్సీలను చూశారా..? ఆవిష్కరణ వీడియో వైరల్
నయావాల్ పుజారా ఆసీస్‌పై 2033 పరుగులు చేయగా విరాట్ కోహ్లి 1,979 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల గురించే ఆసీస్ ఎక్కువగా ఆందోళన చెందుతుంది అనడంలో సందేహం లేదు. కాబట్టి వీరిద్దరి ఎలా పెవిలియన్‌కు చేర్చాలా అన్న అంశంపైనే ఆసీస్ ఖచ్చితంగా దృష్టి సారిస్తుంది. ఓవల్‌లోనూ ఆసీస్ పిచ్ మాదిరి పరిస్థితులే ఉంటాయి. కాబట్టి అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తారు అని రికీ పాంటింగ్ అన్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం
భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్, ఇషాన్ కిషన్.
MS Dhoni: శుభవార్త.. ధోని మోకాలి ఆపరేషన్ సక్సెస్
స్టాండ్ బై ప్లేయర్లు : యశస్వి జైశ్వాల్, సూర్యకుమార్ యాదవ్, ముకేశ్ కుమార్.
ఆస్ట్రేలియా జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, హాజిల్‌వుడ్, నాథన్ లయన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బొలాండ్, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ ఇంగ్లిస్.