Babar Azam: ఒకప్పుడు బాబర్ ఆజం ఆకలితో అలమటించాల్సి వచ్చేదట.. కన్నీరు పెట్టుకున్నపాక్ కెప్టెన్.. తండ్రి వీడియో వైరల్..

బాబర్ ఆజమ్ ఐసీసీ టైటిల్ గెలిచిన తరువాత ఆయన తండ్రి వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో బాబర్ ఆజం తండ్రి తన పాత రోజులను గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యాడు.

Babar Azam: ఒకప్పుడు బాబర్ ఆజం ఆకలితో అలమటించాల్సి వచ్చేదట.. కన్నీరు పెట్టుకున్నపాక్ కెప్టెన్.. తండ్రి వీడియో వైరల్..

Babar Azam_

Babar Azam: పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం వరుసగా రెండో ఏడాది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్ ఆఫ్ ద ఇయర్ టైటిల్‌ను గెలుచుకున్న విషయం విధితమే. ఇటీవల ఐసీసీ ప్రకటించిన 2022 క్రికెట్ అవార్డుల్లో బాబర్‌కు వరుసగా క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. అదేవిధంగా వన్డే క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు బాబర్ ఎంపికయ్యాడు. వరుసగా రెండు సార్లు ఐసీసీ టైటిల్స్ గెలుచుకున్న క్రికెటర్లుగా.. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగర్కర, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబి డివిలియర్స్‌లు ఉన్నారు. తాజాగా వీరి సరసన పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ చేరాడు.

Babar Azam Video: వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు లీక్‌పై తొలిసారి స్పందించిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్.. ఏం చెప్పాడంటే?

బాబర్ అజమ్ 2022లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 2020 సంవత్సరంలో తొమ్మిది వన్డేలు ఆడిన ఆజమ్ 679 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఐదు అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో తొమ్మిది మ్యాచ్ లలో 184 పరుగులు, టీ20 ఫార్మాట్లో 26 మ్యాచ్ లలో 735 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్థ సెంచరీలు ఉన్నాయి. బాబర్ ఆజమ్ ఐసీసీ టైటిల్ గెలిచిన తరువాత ఆయన తండ్రి వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో బాబర్ ఆజం తండ్రి తన పాత రోజులను గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యాడు. ఒకప్పుడు తమ ఇంట్లో తినేందుకు తిండి గింజలు కూడా ఉండేవి కావని, మా ఇద్దరిలో ఒక్కరికే ఆహారం ఉండటంతో, నేనుతింటే బాబర్ పస్తులు ఉండాల్సి వచ్చేదని చెప్పుకుంటూ వీడియోలో బాబర్ ఆజం తండ్రి భావోద్వేగానికి గురయ్యాడు.

 

బాబర్ అజం తండ్రి మాట్లాడుతూ.. నాకు స్కిన్ అలర్జీ ఉండేది. నా కుమారుడు లోపల ప్లే గ్రౌండ్‌లో ఆడుకోవటం వల్ల నేను బయట ఎండలో కూర్చొనేవాడిని. మా వద్ద తినడానికి డబ్బు ఉండేది కాదు. బాబర్ వచ్చి పాపా.. మీరు ఆహారం తిన్నారా? అని అడిగేవాడు. నేను తిన్నాను అని అబద్దం చెప్పేవాడిని. ఒక్కోసారి బాబర్ సైతం నాతో ఇలానే అబద్ధాలు చెప్పేవాడు అని బాబర్ తండ్రి వీడిలో తెలిపాడు. ఇదే వీడియోలో బాబర్ ఆజం మాట్లాడుతూ.. తన జీవితంలోని ఓ సంఘటనను తెలుపుతూ కన్నీరు పెట్టుకున్నాడు. నాకు షూష్ కావాలనుకున్నప్పుడు అవి దక్కలేదు. మా కుటుంబం వద్ద డబ్బులు లేవని చెబుతూ బాబర్ కళ్లలోని వస్తున్న కన్నీటిని తుడుచుకున్నాడు. ఇలా, ఈ వీడియోలో బాబర్ గతంలో అనుభవించిన కష్టాలను తన తండ్రి గుర్తు చేశారు.