Lionel Messi: లియోనెల్ మెస్సీకి ఏడోసారి అవార్డు.. ఎవరూ టచ్ చేయని రికార్డు!

అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ(Lionel Messi) మరోసారి బాలన్ డి'ఓర్ అవార్డును గెలుచుకున్నాడు.

Lionel Messi: లియోనెల్ మెస్సీకి ఏడోసారి అవార్డు.. ఎవరూ టచ్ చేయని రికార్డు!

Messi

Lionel Messi: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ మరోసారి బాలన్ డి’ఓర్ అవార్డును గెలుచుకున్నాడు. మెస్సీ ఈ అవార్డును రికార్డు స్థాయిలో ఏడోసారి కైవసం చేసుకున్నాడు. పోర్చుగల్‌కు చెందిన స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో ​​రొనాల్డో, బేయర్న్ మ్యూనిచ్ స్టార్ రాబర్ట్ లెవాండోస్కీలను వెనక్కినెట్టి 34 ఏళ్ల మెస్సీ ఈ అవార్డును దక్కించుకున్నాడు.

అంతకుముందు మెస్సీ 2009, 2010, 2011, 2012, 2015 మరియు 2019 సంవత్సరాల్లో బాలన్ డి’ఓర్ అవార్డును గెలుచుకున్నాడు. మరే ఇతర ఆటగాడు ఈ అవార్డును ఇన్ని సార్లు గెలుచుకోలేదు. మెస్సీ తర్వాత, క్రిస్టియానో ​​రొనాల్డో అత్యధిక సార్లు బాలన్ డి’ఓర్ అవార్డును గెలుచుకున్నాడు. 2008, 2013, 2014, 2016, 2017 సంవత్సరాల్లో రొనాల్డో ఈ అవార్డును గెలుచుకున్నాడు.

వీరిద్దరూ కాకుండా జోహాన్ క్రైఫ్, మైఖేల్ ప్లాటిని, మార్కో వాన్ బాస్టెన్ 3-3 సార్లు ఈ అవార్డును గెలుచుకోగా, ఫ్రెంచ్ బెకెన్‌బౌర్, రొనాల్డో నజారియో, ఆల్ఫ్రెడో డి స్టెఫానో, కెవిన్ కీగన్, కార్ల్ హెయిన్జ్ 2-2 సార్లు ఈ అవార్డును గెలుచుకున్నారు.

బాలన్ డి’ఓర్ అంటే ఏమిటి?
ఫుట్‌బాల్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు ‘బాలన్‌ డి ఓర్‌’. బాలన్ డి ఓర్ అవార్డులను ఫ్రెంచ్ ఫుట్‌బాల్ మ్యాగజైన్ బాలన్ డి ఓర్ అందజేస్తుంది. ఈ అవార్డు ప్రతి ఏడాది క్లబ్, జాతీయ జట్టులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డును 1956 సంవత్సరంలో స్టాన్లీ మాథ్యూస్‌కు మొదటిసారిగా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఏటా ఇస్తున్నారు. మూడేళ్ల క్రితం 2018 నుంచి మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులకు కూడా ఈ అవార్డు ఇస్తున్నారు.

Drug laws: డ్రగ్స్ చట్టాల్లో సడలింపులు.. మొదటిసారైతే జైల్లో పెట్టరు

ఈ అవార్డును గెలుచుకోవడం పట్ల మెస్సీ సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘మళ్లీ ఈ అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇదో అపురూపం. రెండేళ్ల కిందట ఈ అవార్డును తీసుకుంటున్నప్పుడు ఇక ఇదే చివరిదని అనుకున్నా. కానీ ఈ అవార్డు సాధించడంలో ‘కోపా అమెరికా కప్‌’ గెలవడం ముఖ్య పాత్ర పోషించింది’’ అని మెస్సీ అన్నాడు.