IPL 2020, RCB vs DC, Live: బెంగళూరుపై ఢిల్లీ ఘన విజయం

  • Published By: vamsi ,Published On : October 5, 2020 / 06:43 PM IST
IPL 2020, RCB vs DC, Live:  బెంగళూరుపై ఢిల్లీ ఘన విజయం

[svt-event title=”బెంగళూరుపై ఢిల్లీ విజయం” date=”05/10/2020,11:08PM” class=”svt-cd-green” ] రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 59పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 196పరుగులు చెయ్యగా తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన బెంగళూరు 9వికెట్లు కోల్పోయి 137పరుగులు మాత్రమే చెయ్యేగలిగింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చేసింది. [/svt-event]

[svt-event title=”రబడా రోరింగ్.. బెంగళూరు స్కోరు 121/8″ date=”05/10/2020,10:53PM” class=”svt-cd-green” ] బెంగళూరు బ్యాట్స్‌మెన్‌లపై ఢిల్లీ బౌలర్ రబడా అధ్బుతమై బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లు వేసిన రబడ.. నాలుగు వికెట్లు తీసుకుని 24పరుగులు మాత్రమే ఇచ్చాడు. కీలకమైన కోహ్లీ వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. [/svt-event]

[svt-event title=”బెంగళూరు స్కోరు 118/7″ date=”05/10/2020,10:51PM” class=”svt-cd-green” ] ఢిల్లీతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడుతున్న మ్యాచ్‌లో బెంగళూరు ఓటమికి దగ్గరైంది. 197పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బెంగళూరు 118పరుగులకు 7వికెట్లు కోల్పోయింది. [/svt-event]

[svt-event title=”20ఓవర్లలో ఢిల్లీ స్కోరు 196″ date=”05/10/2020,9:29PM” class=”svt-cd-green” ] ఢిల్లీ, బెంగళూరు మధ్య జరుగుతున్న పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ అధ్భుతంగా ఆడి ఇన్నింగ్స్ ముగిసే సమయానికి నిర్ణీత 20ఓవర్లలో 4వికెట్లు నష్టపోయి 196పరుగులు చేసింది. [/svt-event]

[svt-event title=”స్టాయిన్స్ హాఫ్ సెంచరీ.. పంత్ అవుట్.. ఢిల్లీ స్కోరు 184/4″ date=”05/10/2020,9:17PM” class=”svt-cd-green” ] మార్కస్ స్టాయిన్స్, రిషబ్ పంత్ ఢిల్లీ స్కోరును పరుగులు పెట్టించగా.. స్టాయిన్స్ మెరుపులు మెరిపించాడు. 24బంతుల్లోనే 52పరుగులు పూర్తి చేశాడు. మరోవైపు రిషబ్ పంత్ 25బంతుల్లో 37పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో స్టాయిన్స్, హెట్మేయర్ ఉన్నారు. 19ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 4వికెట్లు నష్టానికి 184పరుగులుగా ఉంది. [/svt-event]

[svt-event title=”16ఓవర్లకు ఢిల్లీ స్కోరు 143/3″ date=”05/10/2020,8:56PM” class=”svt-cd-green” ] కెప్టెన్ శ్రీయాస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత కష్టాల్లో పడిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను మార్కస్ స్టాయిన్స్, రిషబ్ పంత్ కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో 16ఓవర్లకు ఢిల్లీ స్కోరు 3వికెట్ల నష్టానికి 143కి చేరుకుంది.

[/svt-event]

[svt-event title=”పెవిలియన్ చేరిన కెప్టెన్ శ్రీయాస్ అయ్యర్..” date=”05/10/2020,8:33PM” class=”svt-cd-green” ] రెండవ వికెట్‌గా శిఖర్ దావన్ అవుట్ అయిన కాసేపటికే కెప్టెన్ శ్రీయాస్ అయ్యర్ మోయిన్ అలీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 13బంతుల్లో 11పరుగులు చేసిన శ్రీయాస్ అయ్యర్ పాడిక్కల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కీపర్ పంత్, స్టాయిన్స్ ఉన్నారు. [/svt-event]

[svt-event title=”రెండవ వికెట్‌గా దావన్” date=”05/10/2020,8:28PM” class=”svt-cd-green” ] బెంగళూరుపై దూకుడుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ రెండవ వికెట్ కూడా కోల్పోయింది. రెండవ వికెట్‌గా శిఖర్ దావన్ అవుట్ అయ్యాడు. ఇసురు ఉడాన బౌలింగ్‌లో మోయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 28బంతుల్లో 32పరుగులు చేశాడు దావన్. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ శ్రీయాస్ అయ్యర్, కీపర్ పంత్ ఉన్నారు. [/svt-event]

[svt-event title=”పృద్వీ షా అవుట్.. ఢిల్లీ స్కోరు 75/1″ date=”05/10/2020,8:08PM” class=”svt-cd-green” ] బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ పృద్వీ షా అవుట్ అయ్యాడు. ఢిల్లీ స్కోరును పరుగులు పెట్టించిన షా వ్యక్తిగత స్కోరు 42పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. బెంగళూరు బౌలర్ మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో పృద్వీ షా 23బంతుల్లో 42పరుగులు చేసి డివిలియర్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దావన్ 19బంతుల్లో 25పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. అతనితో కెప్టెన్ శ్రీయాస్ అయ్యర్ జత కట్టాడు. ప్రస్తుతం ఢిల్లీ స్కోరు 8ఓవర్లకు 75పరుగులకు చేరుకుంది.

[/svt-event]

[svt-event title=”‘పృద్వీ షా’ట్లు.. వికెట్ కోసం బెంగళూరు పాట్లు.. ఢిల్లీ స్కోరు 63/0 ” date=”05/10/2020,8:01PM” class=”svt-cd-green” ] బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ పృద్వీ షా ఆకాశమే హద్దుగా షాట్లు కొట్టేస్తున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ స్కోరు 63కి చేరుకుంది. వికెట్ నష్టపోకుండా ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి 63పరుగులు చేసింది. వికెట్ కోసం బెంగళూరు పాట్లు పడుతుంది. పృద్వీ షా 22బంతుల్లో 42పరుగులు చెయ్యగా.. దావన్ 14బంతుల్లో 20పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.

[/svt-event]

[svt-event title=”ఢిల్లీ స్కోరు 31/0″ date=”05/10/2020,7:47PM” class=”svt-cd-green” ] టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ మూడు ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 31పరుగులు చేసింది. [/svt-event]

[svt-event title=”Paying XI (Delhi Capitals):” date=”05/10/2020,7:12PM” class=”svt-cd-green” ] శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్(C), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), షిమ్రోను హెట్మియర్, మార్కస్ స్టాయిన్స్, రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్, హర్షల్ పటేల్, కగిసో రబడా, అన్‌రిచ్ Nortje

[/svt-event]

[svt-event title=”Paying XI (Royal Challengers Bangalore):” date=”05/10/2020,7:10PM” class=”svt-cd-green” ] దేవదత్ పాడికల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (సి), ఎబి డివిలియర్స్ (డబ్ల్యూ), మొయిన్ అలీ, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, ఇసురు ఉడనా, నవదీప్ సైని, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

[/svt-event]

[svt-event title=”టాస్ గెలిచిన బెంగళూరు.. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్” date=”05/10/2020,7:05PM” class=”svt-cd-green” ] దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతుంది.

[/svt-event]

[svt-event title=”Probable XI (Royal Challengers Bangalore):” date=”05/10/2020,7:00PM” class=”svt-cd-green” ] దేవదత్ పాడికల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ(C), ఎబి డివిలియర్స్ (వికెట్ కీపర్), శివం దుబే, గుర్కీరత్ సింగ్‌మన్, ఇసురు ఉదనా, వాషింగ్టన్ సుందర్, ఆడమ్ జాంపా, నవదీప్ సైని, యుజ్వేంద్ర చాహల్ [/svt-event]

[svt-event title=”Probable XI(Delhi Capitals):” date=”05/10/2020,6:59PM” class=”svt-cd-green” ] శిఖర్ ధావన్, పృథ్వీ షా/అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్(C), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), షిమ్రోను Hetmyer, మార్కస్ స్టాయిన్స్, రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్, హర్షల్ పటేల్, కగిసో రబడా, అన్‌రిచ్ Nortje [/svt-event]

[svt-event title=”రాత్రి 7గంటల 30నిమిషాలకు మ్యాచ్:” date=”05/10/2020,6:58PM” class=”svt-cd-green” ] రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపిఎల్ 2020 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7గంటల 30నిమిషాలకు ప్రారంభం అవనుండగా.. టాస్ రాత్రి 7 గంటలకు ఉంటుంది. [/svt-event]

[svt-event title=”దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో:” date=”05/10/2020,6:55PM” class=”svt-cd-green” ] రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది.

[/svt-event]

[svt-event title=”హెడ్ ​​టు హెడ్ మ్యాచ్‌లు:” date=”05/10/2020,6:55PM” class=”svt-cd-green” ] మ్యాచ్‌లు: 24, ఆర్‌సీబీ గెలిచినవి: 15, ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది: 8

[/svt-event]

[svt-event title=”మ్యాచ్‌కు ముందు ఢిల్లీకి షాక్:” date=”05/10/2020,6:54PM” class=”svt-cd-green” ] రెండు జట్లలోనూ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు బలంగా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీకి ఊహించని షాక్ తగిలింది. లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా వేలు గాయం కారణంగా ఈ సీజన్ నుండి తప్పుకున్నాడు. అక్టోబర్ 03 న షార్జాన్‌లో కోల్‌కతాతో ఆడిన మ్యాచ్‌లో మిశ్రా క్యాచ్ పట్టుకునే సమయంలో గాయపడ్డాడు.


[/svt-event]

[svt-event title=”ఊహించని విధంగా:” date=”05/10/2020,6:53PM” class=”svt-cd-green” ] ప్రతి ఏడాది ఐపీఎల్ కంటే ఈ ఏడాది ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ గట్టిగా మిగిలిన జట్లకు పోటీ ఇస్తున్నాయి. ఊహించని రీతిలో RCB పుంజుకోగా.. ఢిల్లీ కూడా సీజన్‌లో రాణిస్తుంది. [/svt-event]

[svt-event title=” రెండవ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్.. మూడవ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్:” date=”05/10/2020,6:52PM” class=”svt-cd-green” ] ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు అద్భుతంగా ప్రదర్శన ఇచ్చాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచ్‌లు ఆడింది, అందులో మూడు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ టేబుల్‌లో రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ఈ సీజన్‌లో 4 మ్యాచ్‌ల్లో మూడింటిని గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. [/svt-event]

[svt-event title=”సరి జట్ల మధ్య పోరాటం(Battle of equals):” date=”05/10/2020,6:47PM” class=”svt-cd-green” ] రెండు సమాన బలం కలిగిన జట్లు పోరాటం ఇవాళ(05 అక్టోబర్ 2020) IPL 2020లో చూడబోతున్నాం..

ఐపిఎల్ చరిత్రలో రెండు స్థిరమైన జట్లుగా ఉన్న ఢిల్లీ, బెంగళూరు తొలి ఐపిఎల్ టైటిల్ కోసం ఇంకా వేచి చూస్తుండగా.. రెండు జట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా ఉంటుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్.. రెండు జట్టు కూడా ఈ సీజన్ టైటిల్ రేసులో ఉన్నవే..

ఐపిఎల్ 2020 19 వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు ముఖాముఖిగా తలపడబోతున్నాయి. [/svt-event]