IPL 2020- RCB vs KKR: కోల్‌కత్తాపై బెంగళూరు ఘన విజయం

  • Published By: vamsi ,Published On : October 12, 2020 / 07:05 PM IST
IPL 2020- RCB vs KKR: కోల్‌కత్తాపై బెంగళూరు ఘన విజయం

[svt-event title=”కోల్‌కత్తాపై బెంగళూరు ఘన విజయం” date=”12/10/2020,11:09PM” class=”svt-cd-green” ] బెంగళూరు, కోల్‌కత్తా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అధ్భుతంగా ఆడడంతో కోల్‌కత్తా 82పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలయ్యింది. కోల్‌కత్తా బ్యాట్స్‌మెన్లు బెంగళూరు బౌలర్ల దెబ్బకు 20ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి కేవలం 112 పరుగులు మాత్రమే చెయ్యగలిగారు. సుబ్మాన్ గిల్ మాత్రమే కోల్‌కత్తా బ్యాట్స్‌మెన్లలో 34పరుగులు చేశాడు. ఆండ్రీ రస్సెల్, రాహుల్ త్రిపాఠి చెరో 16పరుగులు చెయ్యగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్లు ఎవరు కూడా డబుల్ డిజిట్ స్కోరు కూడా చెయ్యలేకపోయారు. [/svt-event]

[svt-event title=”ఓటమికి చేరువైన కోల్‌కత్తా.. స్కోరు 104/8″ date=”12/10/2020,11:00PM” class=”svt-cd-green” ] బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కత్తా ఓటమికి చేరువగా అయ్యింది. 195పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కత్తా.. 18ఓవర్లు అయ్యేసరికి 8వికెట్లు కోల్పోయి 104పరుగులు మాత్రమే చేసింది. [/svt-event]

[svt-event title=”సిరాజ్‌కు మొదటి వికెట్, రాహుల్ త్రిపాఠి అవుట్” date=”12/10/2020, 10:58PM” class=”svt-cd-green” ] మొహమ్మద్ సిరాజ్ ఇన్నింగ్స్ 17 వ ఓవర్ చివరి బంతికి ఫస్ట్ వికెట్ తీసుకున్నాడు. క్రిస్ మోరిస్ చేతికి క్యాచ్ ఇచ్చి రాహుల్ త్రిపాఠి (16) అవుట్ అయ్యాడు. త్రిపాఠి తన ఇన్నింగ్స్‌లలో 1 ఫోర్ కొట్టాడు. [/svt-event]

[svt-event title=”KKR ఏడవ వికెట్ పడిపోయింది” date=”12/10/2020, 10:47PM” class=”svt-cd-green” ] KKR విజయం ఇప్పుడు కష్టమే అనిపిస్తుంది. ఓటమికి దగ్గరైన కోల్‌కత్తా జట్టు ఏడవ వికెట్ పడిపోయి 100 పరుగులు ఇంకా పూర్తి కాలేదు. రస్సెల్ తరువాత, పాట్ కమ్మిన్స్ కూడా అవుట్ అయ్యాడు. [/svt-event]

[svt-event title=”KKR ఆశలు ఆవిరైపోయాయి:” date=”12/10/2020, 10:45PM” class=”svt-cd-green” ] కోల్‌కత్తా హార్డ్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ ఉడానా ఓవర్లో అవుట్ అయ్యి పెవిలియన్ చేరాడు. మొదటి బంతికి ఫోర్, తరువాత సిక్స్, తర్వాత ఫోర్ కొట్టి తరువాతి బంతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 10 బంతుల్లో 16 పరుగులు చేశాడు రస్సెల్. [/svt-event]

[svt-event title=”ఐదవ వికెట్‌గా మోర్గాన్:” date=”12/10/2020, 10:33PM” class=”svt-cd-green” ] KKR ఇప్పుడు ఇబ్బందుల్లో చిక్కుకుంది. జట్టు వరుసగా వికెట్లు కోల్పోతుంది. గిల్ తరువాత, కెప్టెన్ దినేష్ కార్తీక్ ఒక పరుగుకే అవుటయ్యాడు. వెంటనే, ఇయాన్ మోర్గాన్ (8) వికెట్ కూడా పడిపోయింది. [/svt-event]

[svt-event title=”పెద్ద షాక్, గిల్ అవుట్” date=”12/10/2020, 10:25PM” class=”svt-cd-green” ] కోల్‌కత్తా జట్టు ఇబ్బందులు ఇప్పుడు పెరుగుతున్నాయి. ఉత్తమ ఇన్నింగ్స్ ఆడుతున్న షుబ్మాన్ గిల్ రనౌట్ అయ్యాడు. 25 బంతుల్లో 34 పరుగులు చేసిన గిల్ అవుట్ అవడంతో KKR గెలుపు కష్టం అవుతూ ఉంది. [/svt-event]

[svt-event title=”రెండవ వికెట్ కోల్పోయిన కోల్‌కత్తా:” date=”12/10/2020, 10:10PM” class=”svt-cd-green” ] కోల్‌కత్తా జట్టు తన రెండవ వికెట్ కోల్పోయింది. నితీష్ రానా 9 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ చేతిలో అవుట్ అయ్యాడు. జట్టు స్కోరు 51 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. [/svt-event]

[svt-event title=”ఫస్ట్ వికెట్ అవుట్:” date=”12/10/2020, 9:50PM” class=”svt-cd-green” ] కోల్‌కతా నైట్ రైడర్స్ ఫస్ట్ వికెట్‌గా టామ్ బాంటన్‌ను కోల్పోయింది. 8 పరుగులు చేసి నవదీప్ సైనీ బౌలింగ్‌లో బాంటన్ అవుట్ అయ్యాడు. [/svt-event]

[svt-event title=”శుభారంభం” date=”12/10/2020, 9:47AM” class=”svt-cd-green” ] కోల్‌కత్తాకు టామ్ బాంటన్ మరియు గిల్ మంచి ఆరంభం ఇచ్చారు. 3 ఓవర్లలో ఎటువంటి వికెట్లు కోల్పోకుండా 16 పరుగులు చేశారు. [/svt-event]

[svt-event title=”బెంగళూరు స్కోరు 194/2.. కోల్‌కత్తా టార్గెట్ 195″ date=”12/10/2020,9:22PM” class=”svt-cd-green” ] కోల్‌కత్తాతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు జట్టు నిర్ణీత 20ఓవర్లలో 2వికెట్లు నష్టానికి 194పరుగులు చేసింది. దీంతో కోల్‌కత్తా జట్టు టార్గెట్ 195పరుగులుగా అయ్యింది. డివిలియర్స్ మెరుపులు స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. డివిలియర్స్‌ 33బంతుల్లో 73పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ 28బంతుల్లో 33పరుగులు చేశాడు. దేవదత్ పాడిక్కల్ 23బంతుల్లో 32పరుగులు చెయ్యగా.. ఆరోన్ ఫించ్ 37బంతుల్లో 47పరుగులు చేశాడు. కోల్‌కత్తా జట్టులో ప్రసీద్ కృష్ణ, ఆండ్రీ రస్సెల్ చెరొక వికెట్ తీసుకున్నారు. [/svt-event]

[svt-event title=”10 ఓవర్లకు బెంగళూరు 78/1″ date=”12/10/2020,8:31PM” class=”svt-cd-green” ] పాడిక్కల్ వికెట్ పడిపోయిన తర్వాత బెంగళూరు జట్టు స్కోరు కాస్త స్లో గా సాగుతుంది. నాగర్‌కోటి వేసిన 10వ ఓవర్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే బెంగళూరుకు లభించాయి. కోహ్లీ (6), ఫించ్‌ (36) చెరో మూడు సింగిల్స్‌ తీశారు. దీంతో 10ఓవర్లకు బెంగళూరు స్కోరు 78/1కి చేరుకుంది. [/svt-event]

[svt-event title=”ఫస్ట్ వికెట్‌గా పాడిక్కల్.. బెంగళూరు స్కోరు 69/1″ date=”12/10/2020,8:21PM” class=”svt-cd-green” ] బెంగళూరు జట్టు 67పరుగుల వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఓపెనింగ్‌కు వచ్చిన పాడిక్కల్ రస్సెల్ వేసిన 8వ ఓవర్‌లో నాల్గవ బంతికి బౌల్డ్ అయ్యాడు. పాడిక్కల్ 23బంతుల్లో 32పరుగులు చేసి అవుట్ అయ్యాడు. [/svt-event]

[svt-event title=”7 ఓవర్లకు 58పరుగులు” date=”12/10/2020,8:08PM” class=”svt-cd-green” ] 7ఓవర్లకు బెంగళూరు వికెట్ నష్టపోకుండా 58పరుగులు పూర్తి చేసింది. [/svt-event]

[svt-event title=”ఓపెనింగ్ అదిరింది.. ఆరు ఓవర్లకు 47పరుగులు..” date=”12/10/2020,8:06PM” class=”svt-cd-green” ] కొల్‌కత్తాతో జరగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టు.. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 47పరుగులు పూర్తి చేసింది. ఓపెనింగ్‌కు వచ్చిన ఫించ్, పాడిక్కల్ అదరగొడుతున్నారు. Aaron Finch 18బంతుల్లో 23పరుగులు చెయ్యగా.. Devdutt Padikkal కూడా 18బంతుల్లో 23పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”కోల్‌కత్తాపై టాప్ స్కోరు 213/4″ date=”12/10/2020,7:45PM” class=”svt-cd-green” ] మ్యాచ్ జరుగుతున్న Sharjah Cricket Stadium చాలా చిన్నది కాగా.. పరుగులు రాబట్టడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో కూడా పరుగులు సునామీ కనిపించే అవకాశం ఉంది. కోల్‌కత్తాపై రాయల్‌ ఛాలెంజర్స్ చివరిసారిగా ఈడెన్ గార్డెన్స్‌లో ఆడిన ఆటలో 4వికెట్లు నష్టానికి 213పరుగులు చేశారు. నేటి వేదిక చాలా చిన్నది కావడంతో ఆ మార్క్ క్రాస్ చేసే అవకాశం కనిపిస్తుంది. [/svt-event]

[svt-event title=”బెంగళూరు బలాలు ఇవే:” date=”12/10/2020,7:30PM” class=”svt-cd-green” ] ఈ సీజన్‌లో ఇప్పటివరకు బెంగళూరు ఆరు మ్యాచ్‌లు ఆడగా.. వాటిలో నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. అదే సమయంలో రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఐపిఎల్ సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచిన KKR రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది.

ఈ క్రమంలో నేటి మ్యాచ్ రసవత్తరంగా ఉండబోతుంది. కెప్టెన్ కోహ్లీ గత మూడు మ్యాచ్‌ల్లో తన ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు. చెన్నైపై ఒంటరిగా 90 పరుగులు చేశాడు. జట్టుకు బలమైన స్కోరు ఇవ్వడంలో విజయవంతం అయ్యాడు. కోహ్లీతో పాటు, బెంగళూరు ఓపెనర్ దేవదత్ పాడికల్ మొదటి నుంచీ ఫామ్‌లో ఉన్నాడు. ఆరోన్ ఫించ్ మాత్రం కాస్త నిలకడగా నిలబడాల్సిన పరిస్థితి.

ఈ జట్టుకు డివిలియర్స్ రూపంలో మరో స్టార్ బ్యాట్స్ మాన్ ఉన్నాడు. ఇక కోహ్లీ జట్టు బౌలింగ్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. శ్రీలంకకు చెందిన ఇసురు ఉడానా, నవదీప్ సైనిలు బెంగళూరుకు బలమైన బౌలర్లుగా ఉన్నారు. మోరిస్ చెన్నైపై మూడు వికెట్లు పడగొట్టాడు.

మోరిస్ నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులు, సైనీ 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. స్పిన్‌లో యుజ్వేంద్ర చాహల్ అధ్భుతంగా రాణిస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ చెన్నైపై రెండు ముఖ్యమైన వికెట్లు పడగొట్టి తన జట్టును బలపరిచాడు. [/svt-event]

[svt-event title=”రస్సెల్ పరుగుల సునామీ ఖాయమేనా? స్ట్రైక్ రేట్ ఎంతంటే?” date=”12/10/2020,7:14PM” class=”svt-cd-green” ] ఐపిఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అనగానే ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే.. విద్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్.. రస్సెల్ బ్యాట్ బెంగళూరుపై ఎప్పుడూ కూడా మంచి స్కోరు చేస్తుంది. బెంగళూరుపై కోల్‌కతా పేలుడు బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్ రికార్డుల లెక్కలు గట్టిగానే ఉన్నాయి.

ఈ సీజన్‌లో రస్సెల్ బ్యాట్ ఇంతవరకు గట్టిగా ఆడకపోయినా కూడా.. ఈ మ్యాచ్‌లో మాత్రం గట్టిగా ఆడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు అతను 6 మ్యాచ్‌ల్లో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. కానీ 2019 లో 14 మ్యాచ్‌ల్లో 510 పరుగులు చేశాడు.

రస్సెల్ బెంగళూరుపై 227 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఇది మాత్రమే కాదు, ఈ కాలంలో అతని సగటు 55.83గా ఉంది. నేటి మ్యాచ్‌లో ఆండ్రీ రస్సెల్ ప్రదర్శన ఎలా ఉంటది అనేది ఆసక్తికరమే.

[/svt-event]

IPL 2020- RCB vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 13 వ సీజన్‌లో సోమవారం షార్జా క్రికెట్ స్టేడియంలో దినేష్ కార్తీక్ నాయకత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విరాట్ కోహ్లీ సారధ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.

రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచ్‌ల్లో గెలిచాయి. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ఫామ్‌లో ఉండగా.. అదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఉత్కంఠ విజయం అందుకుంది.

[svt-event title=”టాస్ గెలిచిన బెంగళూరు..” date=”12/10/2020,7:00PM” class=”svt-cd-green” ] ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుని కోల్‌కత్తాని ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది. [/svt-event]

Royal Challengers Bangalore (Playing XI):

దేవదత్ పాడికల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (సి), ఎబి డివిలియర్స్ (డబ్ల్యూ), వాషింగ్టన్ సుందర్, శివం దుబే, క్రిస్ మోరిస్, ఇసురు ఉదనా, నవదీప్ సైని, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్


Kolkata Knight Riders (Playing XI):

రాహుల్ త్రిపాఠి, షుబ్మాన్ గిల్, నితీష్ రానా, ఎయోన్ మోర్గాన్, దినేష్ కార్తీక్ (w / c), టామ్ బాంటన్, ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, కమలేష్ నాగర్‌కోటి, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి