Bangladesh Cricket Coach: టీమిండియా టెస్ట్ సిరీస్ ఎఫెక్ట్.. బంగ్లా జట్టు కోచ్ రాజీనామా

బంగ్లాదేశ్ జట్టు ప్రధాని కోచ్ డొమింగో రాజీనామా చేసినప్పటికీ పేస్ బౌలింగ్ కోచ్ అలన్ డొనాల్డ్‌తో సహా ఇతర కోచింగ్ సిబ్బంది అందరూ తమ విధుల్లో ఉంటారని బంగ్లా క్రికెట్ బోర్డు చైర్మన్ జలాల్ యూనస్ చెప్పారు. డొమింగో రాజీనామాతో నూతన కోచ్ నియామక ప్రక్రియను ప్రారంభిస్తామని అన్నారు.

Bangladesh Cricket Coach: బంగ్లాదేశ్‌లో టీమిండియా మూడు ఫార్మాట్లలో సిరీస్‍‌లు ఆడింది. అయితే, చివరిగా జరిగిన టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. రెండు టెస్టుల్లోనూ టీమిండియా విజయం సాధించింది. స్వదేశంలో భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం బంగ్లాదేశ్ కోచ్ రస్సెల్ డొమింగో తన కాంట్రాక్ట్ కు ఏడాది మిగిలి ఉండగానే రాజీనామా చేశారు. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ తెలిపారు.

India vs Bangladesh: రెండో టెస్టులో భారత్ ఘన విజయం.. మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలుపు

రస్సెల్ డొమింగో పదవీకాలం వన్డే ప్రపంచ కప్ -2023 వరకు ఉంది. కానీ, ఇంకా సంవత్సరకాలం తన పవీకాలం ఉన్నప్పటికీ ముందే రాజీనామా చేశారు. 2019 సెప్టెంబర్ లో రస్సెల్ బంగ్లా కోచ్ పదవిని చేపట్టాడు. అయితే, భారత్ తో టెస్ట్ సిరీస్ లో బంగ్లా ఆటగాళ్ల ఘోరవైఫల్యం చెందడంతో పాటు ప్రపంచ కప్ కు ముందు అతను కోచ్ పదవికి రాజీనామా చేయడం చర్చనియాంశంగా మారింది.

IND vs BAN 2nd Test: అశ్విన్ – అయ్యర్ 71 పరుగుల భాగస్వామ్యంతో 90ఏళ్ల నాటి రికార్డు..

బంగ్లాదేశ్ జట్టు ఇటీవల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లను స్వదేశంలో ఓడించింది. అయితే భారత్ జట్టును వన్డే సిరీస్ లో ఓడించినప్పటికీ టెస్ట్ సిరీస్ లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. అయితే, కోచ్ రాజీనామా విషయంపై బంగ్లా క్రికెట్ బోర్డు కార్యకలాపాల చైర్మన్ జలాల్ యూనస్ మాట్లాడుతూ.. రస్సెల్ డొమింగో తన రాజీనామాను భారత్ జట్టుతో టెస్టు సిరీస్ ఓటమికి ముందే ఇచ్చాడని, అది తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. డోమింగో రాజీనామా చేసినప్పటికీ పేస్ బౌలింగ్ కోచ్, సహచర దక్షిణాఫ్రికా ఆటగాడు అలన్ డొనాల్డ్ తో సహా ఇతర కోచింగ్ సిబ్బంది అందరూ తమ విధుల్లో ఉంటారని జలాల్ చెప్పాడు. డొమింగో రాజీనామాతో నూతన కోచ్ నియామక ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు