BAN vs IND 1st Test: బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించిన సిరాజ్… పెవిలియన్ బాటపట్టిన కీలక ఆటగాళ్లు

బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. మహ్మద్ సిరాజుద్దీన్ నిప్పులు చెరిగే బంతులకు బంగ్లాదేశ్ బ్యాటర్లు పెవిలియన్ బాటపట్టారు. తొమ్మిది ఓవర్లు వేసిన సిరాజ్ కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు.

BAN vs IND 1st Test: బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించిన సిరాజ్… పెవిలియన్ బాటపట్టిన కీలక ఆటగాళ్లు

Siraj

BAN vs IND 1st Test: బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం తొలి మ్యాచ్ రెండోరోజు ఆట కొనసాగింది. రెండోరోజు 278 ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా.. ఆదిలోనే శ్రేయస్ వికెట్ కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ 86 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తరువాత రవిచంద్ర అశ్విన్ (58), కుల్దీప్ యాదవ్ (40) రాణించడంతో 404 పరుగుల వద్ద టీమిండియా ఆల్ అవుట్ అయింది.

India vs Bangladesh: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. భారత తుది జట్టు ఇదే

బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. మహ్మద్ సిరాజుద్దీన్ నిప్పులు చెరిగే బంతులకు బంగ్లాదేశ్ బ్యాటర్లు పెవిలియన్ బాటపట్టారు. సిరాజ్ వేసిన అద్భుతమైన మొదటి బంతిని అంచనా వేయడంలో విఫలమైన నజ్ముల్ షాంటో (0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం కాసేటికే జట్టు స్కోరు 5 పరుగుల వద్ద యాసిర్ అలీను(4) ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు.

ఆ తరువాత సిరాజ్ వేసిన 13.2 ఓవర్‌కు లిటన్ దాస్ (24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వెంటనే 17.2 ఓవర్లో సిరాజ్ వేసిన బంతికి జకీర్ హసన్ అవుట్ అయ్యాడు. 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పంత్‌కి క్యాచ్ ఇచ్చాడు. దీంతో 18ఓవర్లకే 57 పరుగులు చేసి బంగ్లాజట్టు పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఆ వెంటనే కుల్దీప్ యాదవ్ వేసిన బంతికి షకీబ్ అల్ హసన్ అవుట్ అయ్యాడు. షకీబ్ బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. విరాట్ కోహ్లీకి స్లిప్ వద్ద సులభమైన క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగారు. దీంతో బంగ్లా దేశ్ జట్టు 25ఓవర్లకే 84 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది.