Bangladesh vs India: ఒక్క వికెట్ తేడాతో టీమిండియాపై గెలిచిన బంగ్లాదేశ్

తొలి వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఒక్క వికెట్ తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. వికెట్లన్నీ పడుతున్నప్పటికీ మెహిదీ హొస్సైన్ క్రీజులో పాతుకుపోయి 38 పరుగులు చేసి బంగ్లాదేశ్ జట్టును గెలిపించాడు. చిట్టచివరి బ్యాట్స్‌మన్ గా వచ్చిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ 10 పరుగులు చేసి, వికెట్ పడిపోకుండా చక్కని సహకారం అందించాడు. భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య షేర్-ఎ-బంగ్లా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ వన్డేలో టీమిండియా 186 పరుగులకు 41.2 ఓవర్ల వద్ద ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.

Bangladesh vs India: ఒక్క వికెట్ తేడాతో టీమిండియాపై గెలిచిన బంగ్లాదేశ్

Bangladesh vs India

Bangladesh vs India: తొలి వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఒక్క వికెట్ తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. వికెట్లన్నీ పడుతున్నప్పటికీ మెహిదీ హొస్సైన్ క్రీజులో పాతుకుపోయి 38 పరుగులు చేసి బంగ్లాదేశ్ జట్టును గెలిపించాడు. చిట్టచివరి బ్యాట్స్‌మన్ గా వచ్చిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ 10 పరుగులు చేసి, వికెట్ పడిపోకుండా చక్కని సహకారం అందించాడు. ఆఖరి వికెట్ కు 51 పరుగులు జోడించడం గమనార్హం.

భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య షేర్-ఎ-బంగ్లా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ వన్డేలో టీమిండియా 186 పరుగులకు 41.2 ఓవర్ల వద్ద ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. 187 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌లో నజ్ముల్ షాంటో 0, లిట్టొన్ దాస్ 41, అనముల్ హక్ 14, షకీబ్ హాసన్ 29, రహీం 18, మహ్ముదుల్లా 14, అఫిఫ్ హొస్సైన్ 6, హెహిదీ హాసన్ 38, ఎదాబట్ హొస్సైన్ 0, హాసన్ మహ్ముద్ 0, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 10 పరుగులు చేశారు.

Bangladesh vs India: ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫొటోలు పోస్ట్ చేసిన షమీ

దీంతో బంగ్లాదేశ్ 46 ఓవర్లకు 187/9 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ 3, కుల్దీప్ సేన్, వాషింగ్టన్ సుందర్ రెండు చొప్పున, దీపక్ ఛాహర్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు. కాగా, టీమిండియా బ్యాట్స్‌మెన్ లో రోహిత్ 27, ధావన్ 7, కోహ్లీ 9, శ్రేయాస్ 24, కేఎల్ రాహుల్ 73, వాషింగ్టన్ సుందర్ 19, షెహబాజ్ అహ్మద్ 0, శార్దూల్ ఠాకూర్ 2, దీపక్ చాహర్ 0, మొహమ్మద్ సిరాజ్ 9, కుల్దీప్ సేన్ 2(నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లాకు టీమిండియా 187 పరుగులు లక్ష్యాన్ని మాత్రమే ఇచ్చినప్పటికీ బౌలింగ్ లోనూ టీమిండియా రాణించింది.
విజయం చివరి వరకు ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. విజయం చివరకు బంగ్లాదేశ్ కు దక్కింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..