Bangladesh vs India: మొదటి టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత్ 188 పరుగుల తేడాతో విజయం

మొదటి టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత్ 188 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో భారత్ 404 పరుగులు చేసిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్సులో బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్సును టీమిండియా 258/2 కు డిక్లేర్ చేసింది. మ్యాచులో చివరిరోజైన ఇవాళ బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది.

Bangladesh vs India: మొదటి టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత్ 188 పరుగుల తేడాతో విజయం

Bangladesh vs India

Bangladesh vs India: మొదటి టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత్ 188 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో భారత్ 404 పరుగులు చేసిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్సులో బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్సును టీమిండియా 258/2 కు డిక్లేర్ చేసింది. మ్యాచులో చివరిరోజైన ఇవాళ బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది.

రెండో ఇన్నింగ్సులో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌లో నజ్ముల్ షాంటో 67, జకీర్ హసన్ 100, యాసిర్ అలీ 5, లిట్టన్ దాస్ 19, రహీం 23, షకిబ్ అల్ హసన్ 84, నురుల్ హసన్ 13, మెహిదీ హసన్ 13, తైజుల్ ఇస్లాం 4, ఎదబాత్ 0, ఖలీద్ అహ్మద్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. దీంతో బంగ్లాదేశ్ స్కోరు 324 పరుగులుగా నమోదైంది.

టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 4, కుల్దీప్ యాదవ్ 3, మొహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. రెండు టెస్టు మ్యాచుల సిరీస్ లో టీమిండియా 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు ఈ నెల 22 నుంచి జరగనుంది. బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా వన్డే సిరీస్ ఓడిపోయిన విషయం తెలిసిందే.

Penis-headed statue of Putin: ఇంగ్లాండులో రష్యా అధ్యక్షుడు పుతిన్ అశ్లీల విగ్రహం.. కొడిగుడ్లు విసురుతున్న స్థానికులు