Bangladesh vs India: షకీబ్‌కు 5, ఎబాదత్‌కు 4 వికెట్లు.. 186 పరుగులకే టీమిండియా ఆలౌట్

భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య షేర్-ఎ-బంగ్లా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 186 పరుగులకు 41.2 ఓవర్ల వద్ద ఆలౌట్ అయింది. టీమిండియాలో కేఎల్ రాహుల్ తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. కేఎల్ రాహుల్ ఇవాళ మిడిల్ ఆర్డర్ లో దిగాడు.

Bangladesh vs India: షకీబ్‌కు 5, ఎబాదత్‌కు 4 వికెట్లు.. 186 పరుగులకే టీమిండియా ఆలౌట్

Bangladesh vs India: భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య షేర్-ఎ-బంగ్లా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 186 పరుగులకు 41.2 ఓవర్ల వద్ద ఆలౌట్ అయింది. టీమిండియాలో కేఎల్ రాహుల్ తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. కేఎల్ రాహుల్ ఇవాళ మిడిల్ ఆర్డర్ లో దిగాడు.

టీమిండియా బ్యాట్స్‌మెన్ లో రోహిత్ శర్మ 27, శిఖర్ ధావన్ 7, విరాట్ కోహ్లీ 9, శ్రేయాస్ అయ్యర్ 24, కేఎల్ రాహుల్ 73, వాషింగ్టన్ సుందర్ 19, షెహబాజ్ అహ్మద్ 0, శార్దూల్ ఠాకూర్ 2, దీపక్ చాహర్ 0, మొహమ్మద్ సిరాజ్ 9, కుల్దీప్ సేన్ 2(నాటౌట్) పరుగులు చేశారు. ఎక్స్ ట్రాల రూపంలో భారత్ కు 14 పరుగులు దక్కాయి. దీంతో టీమిండియా 41.2 ఓవర్లకు 186/10 పరుగులు చేసింది.

Bangladesh vs India: ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫొటోలు పోస్ట్ చేసిన షమీ

బంగ్లాదేశ్ బౌలింగ్ లో షాకిబ్ కు 5 వికెట్లు, ఎబాదత్ కు హొస్సైన్ కు 4 వికెట్లు దక్కాయి. మెహిదీ హాసన్ ఒక్క వికెట్ తీశాడు. న్యూజిలాండ్ తో ఇటీవలే వన్డే సిరీస్ ఓడిన టీమిండియా ఇప్పుడు బంగ్లాతో తొలి వన్డేలోనూ బ్యాటింగ్ లో రాణించకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇక మ్యాచ్ అంతా బౌలింగ్ పైనే ఆధారపడి ఉంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..