India vs Bangladesh: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. తొలి వికెట్ కోల్పోయిన ఇండియా

బంగ్లాదేశ్‌తో ఇండియా మొదటి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది.

India vs Bangladesh: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. తొలి వికెట్ కోల్పోయిన ఇండియా

India vs Bangladesh: ఇండియా-బంగ్లాదేశ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ ఓపెనర్లుగా వచ్చారు. అయితే, 23 పరుగుల వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

Pele: నేను బాగానే ఉన్నా.. తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై క్లారిటీ ఇచ్చిన పీలే

శిఖర్ ధావన్ 17 బంతుల్లో 7 పరుగులే చేశాడు. భారత టీమ్.. తుది జట్టు కూర్పులో స్వల్ప మార్పులు చేసింది. ఇటీవల వరుసగా విఫలమవుతున్న రిషబ్ పంత్‌కు వన్డేలకు విశ్రాంతినిచ్చింది. టెస్టుల్లో రిషబ్ ఆడతాడు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా కొనసాగుతాడు. ఈ మ్యాచ్ ద్వారా కుల్దీప్ సేన్ వన్డేల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి టీమిండియా క్యాప్ ఇచ్చి అభినందించాడు. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్ కోల్పోయిన భారత జట్టు బంగ్లాదేశ్ సిరీస్ గెలవాలని పట్టుదలతో ఉంది. బంగ్లాదేశ్ కూడా కొంతకాలంగా ప్రధాన జట్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ ఈ సిరీస్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తోంది.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మొహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్