Bangladesh VS New Zealand: కివీస్ చెత్త రికార్డు.. 60 పరుగులకే ఆలౌట్

బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన న్యూజిలాండ్ చెత్త రికార్డు నమోదు చేసింది. తొలిసారి బంగ్లా చేతిలో ఓడిపోవడమే కాకుండా కేవలం 60పరుగులకే ఆలౌట్ అయింది.

Bangladesh VS New Zealand: కివీస్ చెత్త రికార్డు.. 60 పరుగులకే ఆలౌట్

Ban Vs Nz

Bangladesh VS New Zealand: బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన న్యూజిలాండ్ చెత్త రికార్డు నమోదు చేసింది. తొలిసారి బంగ్లా చేతిలో ఓడిపోవడమే కాకుండా కేవలం 60పరుగులకే ఆలౌట్ అయింది. ఢాకాలో బుధవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది బంగ్లాదేశ్‌. టీ20ల్లో న్యూజిలాండ్‌కిదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ 16.5 ఓవర్లలో 60 పరుగులకే ఆలౌటైంది. షకీబ్‌ (2/10), ముస్తాఫిజుర్‌ (3/13), నాసుమ్‌ అహ్మద్‌ (2/5), సైఫుద్దీన్‌ (2/7) న్యూజిలాండ్‌ను దెబ్బ తీశారు. అనంతరం 15 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ విజయం సాధించింది.

కెప్టెన్ టామ్ లాథమ్, హెన్రీ నికోలస్ 18పరుగుల చొప్పున స్కోర్ చేయగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. స్పిన్నర్లు అహ్మద్, షకీబ్, పేస్ బౌలర్ మొహమ్మద్ సైఫుద్దీన్ చెరో వికెట్లు చొప్పున తీయగలిగారు.

బంగ్లా టీంలో ముస్తిఫర్ రహీమ్ 16, మహ్మదుల్లా 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మరో వికెట్ పడకుండా విజయం సాధించారు. ఈ సిరీస్ కోసం, న్యూజిలాండ్ జట్టు 10 మంది ప్రధాన ఆటగాళ్లు లేకుండానే బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చింది. ఈ రెండు జట్ల మధ్య జరగనున్న రెండో టీ20 శుక్రవారం అదే వేదికగా జరుగుతుంది.