ధోనీతో కలిసి బ్యాటింగ్ చేయడం కలిసొస్తుంది: విరాట్ కోహ్లీ

ధోనీ భాయ్.. క్రీజులోకి వచ్చే ముందు వరకూ వికెట్లు కోల్పోయి మేమంతా అయిపోయిందనుకున్నాం. ఆ తర్వాత చక్కని భాగస్వామ్యాన్ని కొనసాగించాం. ఈ దశలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించేందుకు నానా కష్టాలు పడ్డాం.

  • Published By: veegamteam ,Published On : January 16, 2019 / 09:56 AM IST
ధోనీతో కలిసి బ్యాటింగ్ చేయడం కలిసొస్తుంది: విరాట్ కోహ్లీ

ధోనీ భాయ్.. క్రీజులోకి వచ్చే ముందు వరకూ వికెట్లు కోల్పోయి మేమంతా అయిపోయిందనుకున్నాం. ఆ తర్వాత చక్కని భాగస్వామ్యాన్ని కొనసాగించాం. ఈ దశలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించేందుకు నానా కష్టాలు పడ్డాం.

టీమిండియా రెండో వన్డేలో విజయం సాధించి ఆస్ట్రేలియాకు ఆధిక్యాన్ని తగ్గించింది. సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన ఆసీస్.. రెండో వన్డేలో మాత్రం భారత బ్యాట్స్‌మెన్ ధాటికి నిలవలేకపోయింది. ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్.. ధావన్‌లు పరవాలేదనిపించారు. ధావన్(32) అవుటవడంతో బరిలోకి దిగిన కెప్టెన్ కోహ్లీ(104)112 బంతుల్లో చెలరేగి ఆడాడు. ఆ తర్వాత కోహ్లీకి భాగస్వామ్యం అందించడంలో విఫలమైన రోహిత్(43)పరుగులతో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాయుడు(24)ఆశించినంత మేర రాణించలేకపోయాడు. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(55)బరిలోకి దిగాడు.

31 ఓవర్‌లో స్కోరు బోర్డు 160/3గా నిలిచిన కీలక సమయంలో క్రీజులో పాతుకుపోవడమే కాకుండా పరుగుల వర్షం కురిపించాడు. మరో ఎండ్‌లో ఉన్న కోహ్లీ పరుగులు తీసేందుకు తన వంతు సహకారాన్ని అందించాడు. ఎట్టేకేలకు కోహ్లీ అవుటైనా దినేశ్ కార్తీక్‌తో కలిసి మ్యాచ్‌కు విజయాన్ని తెచ్చిపెట్టాడు. ఈ విజయం పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు. ధోనీ అసమాన ప్రతిభను మరోసారి మీడియా ముందు కొనియాడాడు.  

మ్యాచ్ అనంతరం చాహల్‍తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న కోహ్లీ ధోనీని పొగడ్తలలో ముంచెత్తాడు. ‘ధోనీ భాయ్.. క్రీజులోకి వచ్చే ముందు వరకూ వికెట్లు కోల్పోయి మేమంతా అయిపోయిందనుకున్నాం. ఆ తర్వాత చక్కని భాగస్వామ్యాన్ని కొనసాగించాం. ఈ దశలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించేందుకు నానా కష్టాలు పడ్డాం. మా అందరితో మాట్లాడుతూ ఇంకా చేయాల్సింది చాలా ఉందంటూ అందరిలోనూ ఉత్తేజాన్ని నింపాడు’ అని ఆకాశానికెత్తేశాడు. కోహ్లీ పరుగుల వరద పారించి సెంచరీకి మించి స్కోరు చేసినా అవుటైన సమయానికి లక్ష్యం ఇంకా దూరంలోనే ఉంది. ఈ దశలో ధోనీ తన సత్తా చాటి ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని తెచ్చిపెట్టాడు.