క్రికెటర్లకు సర్ ఫ్రైజ్ ఇచ్చిన అభిమాని, ఏంటో తెలుసా

క్రికెటర్లకు సర్ ఫ్రైజ్ ఇచ్చిన అభిమాని, ఏంటో తెలుసా

Bc mere saamne waale table par gill pant sharma saini : అభిమాన నటుడు, ప్రముఖులు మన ఎదుటే ఉంటే ఏం చేస్తారు ? ఆ ఏముంది ఎంచక్కా..సెల్ఫీ తీసుకోవడమో..ఆటోగ్రాఫ్ తీసుకోవడమో చేస్తాం..అని అంటారు కదా..కానీ.. ఓవ్యక్తి అలా చేయలేదు. ఏకంగా..వారికి సర్ ఫ్రైజ్ ఇచ్చాడు. వారు హోటల్ లో తిన్న భోజనానికి బిల్లు కట్టి..అందర్ని ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటన మెల్ బోర్న్ లో చోటు చేసుకుంది.

ఆస్ట్రేలియా, టీమిండియా జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. కాస్త టీమిండియా క్రికెటర్లు రిలాక్స్ మూడ్ లో ఉన్నారు. రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్ మన్ గి్, నవ్ దీప్ సైనీలు..న్యూ ఇయర్ సందర్భంగా..మెల్ బోర్న్ లోని ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. అక్కడ తమకిష్టమైన ఫుడ్ ను తెప్పించుకుని తింటున్నారు. అదే హోటల్ లో నవల్ దీప్ సింగ్ కూడా ఉన్నారు.

తన ఎదుటే..ఎంతో అభిమానించే క్రీడాకారులు ఉండడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. క్రికెటర్లు కూర్చొన్న టేబుల్ కు ఎదురుగా ఇతను కూర్చొన్నాడు. క్రికెటర్లను చూసి మురిసిపోయాడు. వాళ్లకు ఏదైనా సర్ ఫ్రైజ్ ఇచ్చి..తన అభిమానాన్ని చాటుకోవాలని భావించాడు. వారు ఫుడ్ తినగానే..నవల్ దీప్ సింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్లాడు. క్రికెటర్లు ఏం తిన్నాడో తెలుసుకున్నాడు. ఎంత బిల్ అయ్యిందో అడిగాడు. 118 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 6 వేల 700) చెప్పడం, ఆ డబ్బును నవల్ కట్టివేశాడు.

బిల్లు చెల్లించడానికి క్రికెటర్లు కౌంటర్ దగ్గరకు చేరుకున్నారు. కౌంటర్ దగ్గరున్న వ్యక్తి అసలు విషయం చెప్పాడు. రోహిత్ శర్మ, పంత్ లు నవల్ దగ్గరకు వచ్చి..డబ్బులు తీసుకోవాలని సూచించారు. దీనికి నవల్ సున్నితంగా తిరస్కరించాడు. అభిమానంతోనే చెల్లించానని చెప్పాడు. తన అభిమాన క్రికెటర్లతో సెల్ఫీ దిగిన నవల్ దీప్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. దీనికి సంబంధించిన ట్వీట్ వైరల్ గా మారింది.