WTC Final 2023: యువ ఆట‌గాడికి బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. గాయ‌ప‌డిన కేఎల్ రాహుల్ స్థానంలో ఛాన్స్‌

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో గాయ‌ప‌డ‌డంతో డబ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అత‌డి స్థానంలో యువ ఆట‌గాడిని బీసీసీఐ తీసుకుంది.

WTC Final 2023: యువ ఆట‌గాడికి బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. గాయ‌ప‌డిన కేఎల్ రాహుల్ స్థానంలో ఛాన్స్‌

Ishan Kishan As Replacement Of Injured KL Rahul

WTC Final 2023: ఇంగ్లాండ్‌లోని ఓవ‌ల్‌ వేదిక‌గా జూన్ 7 నుంచి 11 వ‌ర‌కు భార‌త్‌(Team India), ఆస్ట్రేలియా(Australia) జ‌ట్ల మ‌ధ్య ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌ ఫైన‌ల్(WTC Final) మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఇరు జ‌ట్లు ఆ మ్యాచ్‌లో పాల్గొనే ఆట‌గాళ్ల జాబితాను ఇప్ప‌టికే  ప్ర‌క‌టించాయి. అయితే.. టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు, ల‌క్నో కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) ఐపీఎల్‌లో గాయ‌ప‌డ‌డంతో కీల‌క‌మైన ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అత‌డి స్థానంలో ఎవ‌రిని తీసుకుంటారా అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొరికింది.

యువ వికెట్ కీప‌ర్ ఇషాన్ కిష‌న్‌(Ishan Kishan)ను కేఎల్ రాహుల్ స్థానంలో తీసుకున్నారు. ఈ విష‌యాన్ని భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఉమేశ్ యాద‌వ్‌, జ‌య‌దేవ్ ఉనద్క‌త్ లు స్వ‌ల్ప గాయాల‌తో బాధ‌ప‌డుతుండ‌గా ప్ర‌స్తుతం వీరు కోలుకుంటున్నారు. త‌గిన స‌మ‌యంలో వీరి విష‌యంలో సైతం నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు బీసీసీఐ అధికారులు చెప్పారు.

KL Rahul: అఫీషియ‌ల్‌.. ఐపీఎల్‌తో పాటు డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు కేఎల్ రాహుల్ దూరం

శ‌స్త్ర‌చికిత్స అవ‌స‌రం..

త‌న‌కు అయిన గాయానికి శ‌స్త్ర‌చికిత్స అవ‌స‌రం అని దీని కార‌ణంగా ఐపీఎల్‌తో పాటు డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు తాను అందుబాటులో ఉండ‌డం లేద‌ని ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా కేఎల్ రాహుల్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఇది క‌ఠిన‌మైన నిర్ణ‌య‌మే అయినప్ప‌టికీ త‌ప్ప‌డం లేద‌న్నాడు. జ‌ట్టు కెప్టెన్‌గా ఈ కీల‌క‌మైన స‌మ‌యంలో ల‌క్నో జ‌ట్టుతో ఉండ‌క‌పోవ‌డం చాలా బాధ క‌లిగిస్తుంద‌న్నాడు. నీలిరంగు జెర్సీ ధ‌రించి దేశం కోసం ఆడేందుకు తాను చేయ‌గ‌లిగిన‌దంతా చేస్తాన‌న్నాడు. దేశం త‌రుపున ఆడ‌డ‌మే త‌న మొద‌టి ప్రాధాన్య‌త తెలిపాడు. గ‌తంలో కంటే మ‌రింత బ‌లంగా, ఫిట్ తిరిగి వ‌స్తాను అని కేఎల్ రాహుల్ వాగ్దానం చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by KL Rahul👑 (@klrahul)

WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు ముందు భారత్‌కు వ‌రుస షాక్‌లు

డబ్ల్యూటీసీ ఫైనల్‌-2023కి బీసీసీఐ ఎంపిక చేసిన భార‌త జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కేఎస్‌ భరత్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్‌, ఇషాన్ కిష‌న్‌.

స్టాండ్‌బై ఆటగాళ్లు : రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్