BCCI Annual Contracts: గ్రేడ్ ‘ఏ’ ప్లస్ లో రోహిత్, కోహ్లీ సహా మరో ఇద్దరు.. ఎవరెవరికి ఎన్నెన్ని కోట్ల రూపాయలో తెలుసా?

గ్రేడ్ ఏ ప్లస్ ప్లేయర్లకు రూ.7 కోట్లు, గ్రేడ్ ఏ ప్లేయర్లకు రూ.5 కోట్లు, గ్రేడ్ బీ ప్లేయర్లకు రూ.3 కోట్లు, గ్రేడ్ సీ ప్లేయర్లకు రూ.కోటి చెల్లిస్తారు. గ్రేడ్ 'ఏ' ప్లస్ ఆటగాళ్లు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.

BCCI Annual Contracts: గ్రేడ్ ‘ఏ’ ప్లస్ లో రోహిత్, కోహ్లీ సహా మరో ఇద్దరు.. ఎవరెవరికి ఎన్నెన్ని కోట్ల రూపాయలో తెలుసా?

BCCI Annual Contracts

BCCI Annual Contracts: బీసీసీఐ తాజాగా టీమిండియా సీనియర్ ఆటగాళ్ల ఆన్యువల్ ప్లేయర్ రిటైన్షిప్ 2022-23 ప్రకటిచింది. ఆన్యువల్ ప్లేయర్ కాంట్రాక్ట్స్ చెల్లింపుల గురించి వివరాలు తెలిపింది. బీసీసీఐ తెలిపిన వివరాల ప్రకారం కేఎల్ రాహుల్ సహా కొందరు ఆటగాళ్లు కాంట్రాక్ట్స్‌ గ్రేడ్స్‌ లో స్థానాన్ని దిగజార్చుకున్నారు. 2022 అక్టోబరు-2023 సెప్టెంబరు కాలంలో ఆన్యువల్ ప్లేయర్ రిటైన్షిప్ లోని ఆటగాళ్లకు చెల్లింపులు ఈ విధంగా ఉంటాయి. గ్రేడ్ ఏ ప్లస్ ప్లేయర్లకు రూ.7 కోట్లు, గ్రేడ్ ఏ ప్లేయర్లకు రూ.5 కోట్లు, గ్రేడ్ బీ ప్లేయర్లకు రూ.3 కోట్లు, గ్రేడ్ సీ ప్లేయర్లకు రూ.కోటి చెల్లిస్తారు.

గ్రేడ్ ‘ఏ’ ప్లస్ ఆటగాళ్లు (రూ.7 కోట్లు)
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
జస్ప్రీత్ బుమ్రా
రవీంద్ర జడేజా

గ్రేడ్ ‘ఏ’ ఆటగాళ్లు (రూ.5 కోట్లు)
హార్దిక్ పాండ్యా
రవిచంద్రన్ అశ్విన్
మొహమ్మద్ షమీ
రిషభ్ పంత్
అక్షర్ పటేల్

గ్రేడ్ ‘బీ’ ఆటగాళ్లు (రూ.3 కోట్లు)
ఛటేశ్వర్ పుజారా
కేఎల్ రాహుల్
శ్రేయాస్ అయ్యర్
మొహమ్మద్ సిరాజ్
సూర్య కుమార్ యాదవ్
శుభ్‌మన్ గిల్

గ్రేడ్ ‘సీ’ ఆటగాళ్లు (రూ.కోటి)
ఉమేశ్ యాదవ్
శిఖర్ ధావన్
శార్దూల్ ఠాకూర్
ఇషాన్ కిషన్
దీపక్ హూడా
చాహెల్
కుల్దీప్ యాదవ్
వాషింగ్టన్ సుందర్
సంజూ శాంసన్
అర్ష్ దీప్ సింగ్
కేఎస్ భరత్

IPL-2023: కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ స్థానంలో నితీశ్ రాణా