India’s squad: వెస్టిండీస్‌తో సిరీస్‌కి టీమిండియాని ప్రకటించిన బీసీసీఐ

ఈ ఏడాది ఆరంభంలోనే దూకుడు మీదున్న టీమిండియాకు దక్షిణాఫ్రికా టూర్‌లో చేదు అనుభవం ఎదురైంది.

India’s squad: వెస్టిండీస్‌తో సిరీస్‌కి టీమిండియాని ప్రకటించిన బీసీసీఐ

Team India

India’s squad: ఈ ఏడాది ఆరంభంలోనే దూకుడు మీదున్న టీమిండియాకు దక్షిణాఫ్రికా టూర్‌లో చేదు అనుభవం ఎదురైంది. వన్డే, టెస్ట్ సిరీస్‌లలో ఓటమి తర్వాత.. ఇప్పుడు టీమిండియా వెస్టిండీస్‌పై సిరీస్ ఆడబోతుంది. ఈ ఏడాది తొలి విజయాన్ని వెస్టిండీస్‌పై నమోదు చేయాలని భావిస్తోంది. భారత జట్టు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి సొంతగడ్డపై వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) టీమిండియాను ప్రకటించింది.

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (wk), దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రశిద్ద్ కృష్ణ, అవేష్ ఖాన్.

టీ20ఐ సిరీస్ కోసం భారత జట్టు – రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (WK), వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్.

జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. కేఎల్ రాహుల్ రెండో వన్డే నుంచి అందుబాటులోకి రానున్నాడు. రవింద్ర జడేజా మోకాలి గాయం కారణంగా కోలుకుంటున్నాడు. ఈ కారణంగానే ODIలు, T20Iలకు జడేజా అందుబాటులో ఉండట్లేదు. అక్షర్ పటేల్ టీ20లకు అందుబాటులో ఉండనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

వెస్టిండీస్ భారత పర్యటన షెడ్యూల్-
1వ ODI – 6 ఫిబ్రవరి (అహ్మదాబాద్)
2వ ODI – 9 ఫిబ్రవరి (అహ్మదాబాద్)
3వ ODI – 12 ఫిబ్రవరి (అహ్మదాబాద్)

టీ20 సిరీస్
మొదటి T20 – 15 ఫిబ్రవరి (కోల్‌కతా)
రెండవ T20 – 18 ఫిబ్రవరి (కోల్‌కతా)
మూడవ T20 – 20 ఫిబ్రవరి (కోల్‌కతా).