Chetan Sharma: కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విబేధాలు.. స్టింగ్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెల్లడించిన చేతన్ శర్మ

చాలా మంది ఆటగాళ్లు 80-85 శాతం మాత్రమే ఫిట్‌గా ఉంటారు. కానీ పూర్తి ఫిట్‌గా కనిపించి, టీమ్‌లోకి వచ్చేందుకు ఇంజక్షన్లు తీసుకుంటారు. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ కోసం బుమ్రా ఎంపిక విషయంలో నాకు, జట్టు మేనేజ్‌మెంట్‌కు మధ్య విబేధాలు తలెత్తాయి.

Chetan Sharma: కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విబేధాలు.. స్టింగ్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెల్లడించిన చేతన్ శర్మ

Chetan Sharma: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న చేతన్ శర్మ ఒక టీవీ ఛానెల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెల్లడించాడు. ఆయన వెల్లడించిన విషయాలు ఇప్పుడు భారత క్రికెట్‌ను ఒక కుదుపునకు గురి చేస్తున్నాయి. మంగళవారం నాటి స్టింగ్ ఆపరేషన్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా సహా పలువురు ఆటగాళ్ల గురించి కీలక విషయాలు చెప్పాడు.

Maharashtra: సహజీవనం చేస్తున్న ప్రేయసిని చంపిన ప్రియుడు.. మృతదేహాన్ని బెడ్ కింద దాచి పరార్

ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ‘‘చాలా మంది ఆటగాళ్లు 80-85 శాతం మాత్రమే ఫిట్‌గా ఉంటారు. కానీ పూర్తి ఫిట్‌గా కనిపించి, టీమ్‌లోకి వచ్చేందుకు ఇంజక్షన్లు తీసుకుంటారు. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ కోసం బుమ్రా ఎంపిక విషయంలో నాకు, జట్టు మేనేజ్‌మెంట్‌కు మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులు, వన్డే సిరీస్‌కు కూడా బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మధ్య విబేధాలున్నాయి.

Valentine’s Day: వాలెంటైన్స్ డే జరుపుకొనేందుకు గోవా వెళ్లిన జంట.. నీళ్లలో మునిగి ప్రేమికులు మృతి

గంగూలీకి కోహ్లీపై వ్యతిరేకత ఉంది. జట్టులో రెండు వర్గాలున్నాయి. ఒకటి రోహిత్ వర్గం.. రెండోది కోహ్లీ వర్గం. రోహిత్, కోహ్లీ మధ్య అమితాబ్, ధర్మేంద్ర వంటి పరిస్థితులున్నాయి. ఆటకన్నా తాను పెద్దవాడ్నని కోహ్లీ అనుకుంటాడు. దీర్ఘకాలంలో టీ20 జట్టును హార్ధిక్ పాండ్యా నడిపిస్తాడు. ఇషాన్ కిషన్, శుభ్‌మన్‌గిల్ వల్ల సంజు శాంసన్, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ కెరీర్ ప్రమాదంలో పడింది. రోహిత్, హార్ధిక్ నన్ను నమ్ముతారు. ఇద్దరూ మా ఇంటికి వచ్చారు. తరచూ హార్ధిక్ నన్ను కలుస్తాడు’’ అని చేతన్ శర్మ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం చేతన్ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీసీసీఐ ఈ వ్యవహారాన్ని సమీక్షిస్తోంది. అయితే, దీనిపై మాట్లాడేందుకు సెలెక్టర్లు ఎవరూ ఆసక్తి చూపడం లేదు.