అదే డబ్బును ఇలా: బీసీసీఐ రూ.20 కోట్లు ఇవ్వనుంది

అదే డబ్బును ఇలా: బీసీసీఐ రూ.20 కోట్లు ఇవ్వనుంది

అదే డబ్బును ఇలా: బీసీసీఐ రూ.20 కోట్లు ఇవ్వనుంది

టీమిండియా క్రికెటర్ల కోరికను బీసీసీఐ నెరవేర్చింది. తన వంతు సాయంగా ఆర్మీబలగాలకు రూ.20కోట్ల రూపాయలను విరాళాన్ని ప్రకటించింది. పుల్వామా ఉగ్రదాడి బాధితులైన 40మంది కుటుంబాలకు ఈ సాయం చేరాలని కోరింది. త్రివిధ దళాలైన ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీలు పుల్వామా ఉగ్రదాడి విషయంలో పాకిస్తాన్‌తో జరిగిన వివాదంలో బాగా నష్టపోయాయి. 
Read Also : ధోనీ లేకపోవడం వల్లే భారత్ ఓడిపోయింది: పాంటింగ్

ఈ మేర రాంచీ వేదికగా జరిగిన వన్డేలో ఆర్మీ క్యాప్‌లతో బరిలోకి దిగిన సమయంలోనే టీమిండియా కెప్టెన్ కోహ్లీ త్రివిధ దళాలకు విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. దీనికి వేదికగా ఐపీఎల్ 12సీజన్ తొలి మ్యాచ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ను ఎంచుకుంది. ఇరు జట్ల కెప్టెన్‌లు అయిన మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ చేతుల మీదుగా రూ.20కోట్లు అందజేస్తారట. 

ఈ విషయంపై బీసీసీఐ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. గతేడాది ఐపీఎల్ ఆరంభ వేడుకలకు రూ. 15కోట్లు ఖర్చు అయ్యాయి. ఐపీఎల్ 12 సీజన్‌కు రూ.20కోట్లు కేటాయించాలని అనుకున్నాం. ఆ మొత్తాన్ని ఉగ్రదాడి బాధితులైన అమరుల కుటుంబాలకు ఇవ్వాలనుకోవడంతో ఆర్మీ వెల్ఫేర్ ఫండ్, నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు ఇవ్వదలచుకున్నాం’ అని వెల్లడించారు. 
 

Read Also : నువ్వు తోపు బాసూ : 2020 వరకు రవిశాస్త్రినే

×