Guinness World Record: గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన బీసీసీఐ

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022 ఫైనల్ మ్యాచు గుజరాత్ టైటాన్స్-రాజస్థాన్ రాయల్స్ కు మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. ఆ మ్యాచుకు ఎన్నడూలేనంత మంది వచ్చారు. ఈ ఏడాది మే 29న జరిగిన ఆ మ్యాచుకు 1,01,566 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.

Guinness World Record: గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన బీసీసీఐ

Guinness World Record

Guinness World Record: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022 ఫైనల్ మ్యాచు గుజరాత్ టైటాన్స్-రాజస్థాన్ రాయల్స్ కు మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. ఆ మ్యాచుకు ఎన్నడూలేనంత మంది వచ్చారు. ఈ ఏడాది మే 29న జరిగిన ఆ మ్యాచుకు 1,01,566 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.

దీంతో బీసీసీఐకి గిన్నిస్ ప్రపంచ రికార్డు ప్రతినిధులు ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను తాజాగా అందించారు. ‘‘భారత్ గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించడం మనందరికీ గర్వకారణం. ఇది మన ఫ్యాన్స్ అందరికీ సంబంధించిన రికార్డు. వారి మద్దతు, క్రికెట్ పట్ల వారికి ఉన్న ప్యాషన్ కు దక్కిన గౌరవం. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్, ఐపీఎల్ కు శుభాకాంక్షలు’’ అని బీసీసీఐ పేర్కొంది.

Marburg virus: ఈ వైరస్‌ను కట్టడి చేయండి.. లేదంటే ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తుంది: డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

‘‘1,01,566 మంది ప్రేక్షకులు హాజరైనందుకు గిన్నిస్ ప్రపంచ రికార్డు అందుకోవడాన్ని చాలా గర్వంగా భావిస్తున్నాను. క్రికెట్ అభిమానులకు ధన్యవాదాలు’’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నారు. కాగా, అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్ద మైదానం. ఇందులో 1,32,000 మంది కూర్చునే సామర్థ్యం ఉంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..