BCCI Pension : మాజీ క్రికెటర్లు, అంపైర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్.. భారీగా పెంపు

మాజీ క్రికెటర్లు, మాజీ అంపైర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వారి నెలవారి పెన్షన్ డబుల్ కానుంది. ఈ మేరకు కొత్త పెన్షన్ విధానం రూపొందించింది.

BCCI Pension : మాజీ క్రికెటర్లు, అంపైర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్.. భారీగా పెంపు

Bcci Pension

BCCI Pension : మాజీ క్రికెటర్లు, మాజీ అంపైర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వారి నెలవారి పెన్షన్ డబుల్ కానుంది. ఈ మేరకు కొత్త పెన్షన్ విధానం రూపొందించింది. పురుష, మహిళా మాజీ క్రికెటర్లకు, మాజీ అంపైర్లకు నెలవారీ పెన్షన్ ను పెంచుతున్నట్టు బీసీసీఐ తెలిపింది. మాజీ ఆటగాళ్లు, అంపైర్ల ఆర్థిక స్థితిగతులు కూడా తమకు ముఖ్యమేనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ఆటకు వీడ్కోలు పలికినప్పటికీ వారి బాగోగులను పట్టించుకోవడం బోర్డు విధి అని వెల్లడించారు. వాస్తవానికి అంపైర్లు పెద్దగా గుర్తింపుకు నోచుకోరని, ఈ నేపథ్యంలో, వారు అందించిన సేవలకు బీసీసీఐ ఎంతో విలువ ఇస్తుందని అన్నారు.

IPL 2023: రూ.43వేల కోట్లు దాటిన టెలికాస్టింగ్ హక్కుల ధర

బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత క్రికెట్ కు వారు అందించిన సేవలకు ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తెలిపారు. దాదాపు 900 మంది వరకు తాజా పెన్షన్ స్కీమ్ ద్వారా లబ్ది పొందుతారని, వారిలో 75 శాతం మంది వందశాతం పెన్షన్ పెంపు ప్రయోజనం అందుకుంటారని జై షా వివరించారు.

Virat Kohli: ఇన్‌స్టాలో 20 కోట్ల ఫాలోవర్లతో కోహ్లీ రికార్డు.. దేశంలోనే నెంబర్ 1

ఇప్పటిదాకా నెలకు రూ.15 వేలు అందుకునే వారు ఇకపై రూ.30 వేలు(ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు)… రూ.22,500 అందుకునేవారు ఇకపై రూ.45,000… రూ.30 వేలు అందుకునేవారు ఇకపై రూ.52 వేలు… రూ.37,500 అందుకునేవారు(మాజీ టెస్ట్ ప్లేయర్లు) ఇకపై రూ.60,000… రూ.50,000 అందుకునేవారు రూ.70,000 పెన్షన్ అందుకోనున్నారు. ఇక మహిళా క్రికెటర్ల విషయానికి వస్తే ఇప్పటివరకు రూ.30వేలు అందుకునే వారు ఇకపై 52వేల 500 రూపాయలు పెన్షన్ గా అందుకోనున్నారు. ఇక 2003కి ముందు రిటైర్ అయిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు ఇప్పటివరకు రూ.22వేల 500 అందుకునే వారు. ఇకపై వారు రూ.45వేలు పెన్షన్ గా తీసుకోనున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కొత్త పెన్షన్ విధానంతో సుమారు 900 మందికి లబ్ది కలగనుంది. మాజీ క్రికెటర్లు, అధికారుల్లో 75శాతం మందికి 100శాతం పెన్షన్ పెరగనుంది.