BCCI Ombudsman : సచిన్, లక్ష్మణ్ హాజరవుతారా

  • Published By: madhu ,Published On : May 1, 2019 / 02:25 AM IST
BCCI Ombudsman : సచిన్, లక్ష్మణ్ హాజరవుతారా

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, సొగసరి బ్యాట్స్ మెన్ లక్ష్మణ్‌లు బీసీసీఐ అంబుడ్స్ మెన్ ఎదుట హాజరవుతారా ? లేదా ? అనే చర్చ జరుగుతోంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసు విచారణలో అంబుడ్స్ మెన్ కమ్ ఎథిక్స్ ఆఫీసర్ రిటైర్డ్ జస్టిస్ డీకే జైన్ పలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా హాజరు కావాలని సచిన్, లక్ష్మణ్‌లకు సూచించారు. ఇప్పటికే ఈ నోటీసులకు క్రికెటర్లిద్దరూ లిఖితపూర్వకంగా వివరణనిచ్చారు. 

సీఏసీ సభ్యులుగా ప్రతిఫలం ఆశించకుండా తాము పనిచేయడం జరుగుతోందని..ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సలహాదారులుంగా ఉంటే పరస్పర విరుద్ధ ప్రయోజనాలను ఎలా ఆపాదిస్తారని సచిన్, లక్ష్మణ్‌లు ప్రశ్నించారు. న్యాయసూత్రాల ప్రకారం గంగూలీ అంబుడ్స్‌మెన్ ముందుకు వచ్చినట్లే వారు రావాల్సి ఉంటుందని బీసీసీఐ భావిస్తోంది. వివాదాస్పద పేసర్ శ్రీశాంత్ విచారణలోనూ సీఈఓ హాజరయ్యారని, ఇప్పుడు కూడా ఆయన అందుబాటులో ఉంటుందని తెలిపింది.  

ఐపీఎల్ ఫ్రాంచైజీలకు మోంటార్లుగా సచిన్(ముంబై), లక్ష్మణ్ (హైదరాబాద్)లు వ్యవహరిస్తున్నారు. భారత జట్టుకు కోచ్ నియామకంతో పాటు మరికొన్న కీలక నిర్ణయాల కోసం BCCI కొన్నేళ్ల కిందట సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో క్రికెట్ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు సంజీవ్ గుప్తా చేసిన కంప్లయింట్ మేరకు BCCI అంబుడ్స్‌మెన్, ఎథిక్స్ అధికారి డీకే జైన్ నోటీసులు జారీ చేశారు.