WPL-2023: మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం.. మహిళలకు టిక్కెట్లు ఉచితం

ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకల్లో పలువురు బాలీవుడ్ తారలు ప్రదర్శన ఇవ్వబోతున్నారు. కియారా అద్వానీ, క్రితి సనన్ డాన్స్ పెర్ఫామెన్స్‌తోపాటు పంజాబీ ర్యాపర్ ఏపీ ధిల్లాన్ లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు.

WPL-2023: మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం.. మహిళలకు టిక్కెట్లు ఉచితం

WPL-2023: బీసీసీఐ తొలిసారి నిర్వహిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఈ నెల 4 నుంచి ప్రారంభం కానుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకల్లో పలువురు బాలీవుడ్ తారలు ప్రదర్శన ఇవ్వబోతున్నారు.

Bhool Bhulaiyaa 2 : ఆ హిట్ సినిమాకు మరో సీక్వెల్ అనౌన్స్ చేసిన కార్తీక్ ఆర్యన్.. హిట్ కోసమేనా??

కియారా అద్వానీ, క్రితి సనన్ డాన్స్ పెర్ఫామెన్స్‌తోపాటు పంజాబీ ర్యాపర్ ఏపీ ధిల్లాన్ లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు. శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ వేడుకకు సంబంధించిన టిక్కెట్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ వేడుకల సందర్భంగా బీసీసీఐ ఒక ఆఫర్ ప్రకటించింది. మహిళలకు టిక్కెట్లు ఉచితంగా ఇవ్వనుంది. మ్యాచ్ చూడాలనుకునే వాళ్లు ఉచితంగానే స్టేడియానికి హాజరుకావొచ్చు. మొదటి మ్యాచ్ ముంబై-గుజరాత్ మధ్య జరుగుతుంది. మార్చి 26 వరకు టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీలో ఐదు జట్లు పాల్గొంటున్నాయి.

Husband Locked Wife : భార్యను 11 ఏళ్లుగా ఇంట్లోనే బంధించిన భర్త

అవి ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్. ఐపీఎల్ మ్యచుల్ని జియో సినిమా యాప్ లేదా వెబ్‌లో లైవ్‌లో ఉచితంగా చూడొచ్చు. అలాగే స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్ ఛానెల్‌లోనూ వీక్షించవచ్చు. ఈ టోర్నీలో అన్ని మ్యాచులు ముంబైలోనే జరుగుతాయి. ఇతర ప్రాంతాల్లో మ్యాచులు నిర్వహించడం లేదు. ప్రతి మ్యాచ్ ప్రారంభ టిక్కెట్ ధర రూ.100గా ఉంది. ఇప్పటికే చాలా వరకు టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఐపీఎల్‌లాగే డబ్ల్యూపీఎల్‌కు కూడా మంచి ఆదరణ దక్కుతుందని బీసీసీఐ, జట్టు యాజమాన్యాలు ధీమాతో ఉన్నాయి. డబ్ల్యూపీఎల్ ముగిసిన వెంటనే ఐపీఎల్ ప్రారంభమవుతుంది.