BCCI President : గంగూలీ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్

నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో గంగులీ ఆరోగ్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గంగూలీ రాత్రంతా నిద్రపోయారని, భోజనం కూడా చేశారని తెలిపారు.

BCCI President : గంగూలీ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్

Ganguly

Sourav Ganguly Health Update : BCCI అధ్యక్షులు గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయనకు ఫీవర్ లేదని..భయపడాల్సినవసరం ఏమీ లేదని పేర్కొన్నారు. ఇటీవలే గంగూలీ కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో..ఆయన్ను కోల్ కతాలోని వుడ్ లాండ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో గంగులీ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గంగూలీ రాత్రంతా నిద్రపోయారని, భోజనం కూడా చేశారని తెలిపారు. ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఆయన రెండుసార్లు కోవిడ్ టీకా తీసుకున్నారు.

Read More : AP Corona Cases : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..

48 సంవత్సరాలున్న మాజీ కెప్టెన్, బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కోల్‌కతాలోని తన నివాసంలో ఉన్న జిమ్‌లో వర్క్ఔట్ చేస్తూ అస్వస్థతకి గురై కిందపడిపోయిన గంగూలీకి.. 2021, జనవరి 27వ తేదీన ఛాతీ నొప్పి రావడంతో హుటాహుటిన కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. తొలుత గుండెపోటు వచ్చిన సమయంలోనే ఆయనకు యాంజియోప్లాస్టీ సర్జరీ చేయగా.. 13 మంది డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందించింది. ఐదు రోజుల చికిత్స అనంతరం జనవరి 7న గంగూలీ డిశ్చార్జి అయ్యారు. అంతా బాగుందని అనుకోగా.. మరోసారి ఆయన అస్వస్థతకు గురయ్యారు. చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్ చేశారు. భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలాడిన సౌరవ్ గంగూలీ.. మొత్తం 38 అంతర్జాతీయ శతకాలు నమోదు చేశాడు. ఐపీఎల్‌లోనూ 59 మ్యాచ్‌లాడిన దాదా 106.81 స్ట్రైక్‌రేట్‌తో 1,349 పరుగులు చేశాడు. బౌలర్‌గానూ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 132 వికెట్లు, ఐపీఎల్‌ 10 వికెట్లని సౌరవ్ పడగొట్టారు.