Sourav Ganguly: ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా సౌరవ్ గంగూలీ

బీసీసీఐ ప్రెసిడెంట్, టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. మరో పదవి బాధ్యతలు అందుకున్నారు. ఐసీసీ క్రికెట్ కమిటీకి ఛైర్మన్ గా నియమితులయ్యారు. బుధవారం ఐసీసీ ఈ విషయాన్ని ప్రకటిస్తూ అనిల్

10TV Telugu News

Sourav Ganguly: బీసీసీఐ ప్రెసిడెంట్, టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. మరో పదవి బాధ్యతలు అందుకున్నారు. ఐసీసీ క్రికెట్ కమిటీకి ఛైర్మన్ గా నియమితులయ్యారు. బుధవారం ఐసీసీ ఈ విషయాన్ని ప్రకటిస్తూ అనిల్ కుంబ్లే స్థానాన్ని గంగూలీ భర్తీ చేస్తున్నట్లు తెలిపింది.

‘మూడేళ్ల పాటు ఉండే పదవిని గరిష్ఠంగా మూడు సార్లు పూర్తి చేయడంతో అనిల్ కుంబ్లే పదవిలో నుంచి తప్పుకుంటున్నారు. అతని స్థానంలో బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ బాధ్యతలు అందుకోనున్నారు’ అని ఐసీసీ స్టేట్మెంట్ లో వెల్లడించింది.

గంగూలీని మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా అభివర్ణించిన ఐసీసీ.. ఆ జనరేషన్ లో బెస్ట్ బ్యాట్స్ మెన్ అంటూ పొగిడింది కూడా. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కు 2015 నుంచి 2019వరకూ ప్రెసిడెంట్ గా ఉండి.. అక్టోబర్ 2019లో బీసీసీఐ ప్రెసిడెంట్ అయ్యారు.

ఈ సందర్భంగా అనిల్ కుంబ్లే లీడర్ షిప్ కు ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే థ్యాంక్స్ చెప్పారు. తొమ్మిదేళ్ల పాటు సేవలందించిన కుంబ్లేకు థ్యాంక్స్. సౌరవ్ కు ఇదే మా స్వాగతం’ అని పేర్కొన్నారు.

…………………………………………….. : వార్ వన్‌సైడ్.. నెల్లూరులో వైసీపీ క్లీన్‌స్వీప్.. 54 డివిజన్లలోనూ ఫ్యాన్ గాలి

వరల్డ్ బెస్ట్ ప్లేయర్స్ లో ఒకరైన గంగూలీ అనుభవం మనకు హెల్ప్ అవుతుందని భావిస్తున్నా. క్రికెటింగ్ నిర్ణయాలు తీసుకోవడానికి అది చాలా అవసరం. తొమ్మిదేళ్ల అనిల్ లీడర్ షిప్ కు థ్యాంక్స్. ఇంటర్నేషనల్ గా గేమ్ ఎదగడంలో తోడ్పడ్డాడు’ అని కొనియాడారు.

×