దూల తీరింది: బీసీసీఐకి రూ.11 కోట్లు చెల్లించిన పాకిస్తాన్

దూల తీరింది: బీసీసీఐకి రూ.11 కోట్లు చెల్లించిన పాకిస్తాన్

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరో మాట లేకుండా బీసీసీఐకి 1.6 మిలియన్ డాలర్లు చెల్లించింది. బీసీసీఐ తమతో ఆడాల్సిన ఆరు ద్వైపాక్షిక సిరీస్‌ల ఒప్పందాన్ని ఉల్లంఘించందంటూ ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చేదు అనుభవం ఎదురైంది. ఈ మేర పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మనీ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఐసీసీకి ఫిర్యాదు చేసిన నష్ట పరిహారం కేసులో మేం విఫలమైయ్యాం. అందుకే 2.2 మిలియన్ల యూఎస్ డాలర్లు చెల్లించాల్సి ఉంది’ అని వెల్లడించాడు. 
Read Also : పాక్‌ ముందు ఓడిపోవడానికి భారత్ సిద్ధంగా ఉండాలి

గతంలో బీసీసీఐ.. పీసీబీల మధ్య 2015 నుంచి 2023 మధ్య కాలంలో ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ, ప్రత్యేక కారణాల రీత్యా బీసీసీఐ ఆడేందుకు నిరాకరించింది. బీసీసీఐ ఆడతామని చెప్పి మోసం చేసిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు ఆరోపించారు. భారత్ క్రికెట్ బోర్డుకు హెచ్చరికలు పంపారు. 

ఏమైనా చేసుకొమ్మని ఆటను నిరాకరించడానికి తమ దగ్గర సరైన కారణాలు ఉన్నాయంటూ బీసీసీఐ చెప్పుకొచ్చింది. లెక్కచేయని ఐసీసీ లీగల్ కమిటీకి ఫిర్యాదు చేసింది. పలు దఫాలుగా జరిగిన ఈ కేసు విచారణ పూర్తి అయిన తర్వాత పాకిస్తాన్ ఓటమికి గురైంది. చివరకు న్యాయపరమైన ఖర్చులను, ప్రయాణపు ఖర్చులకు వెచ్చించిన మొత్తాన్ని పాక్ క్రికెట్ బోర్డు చెల్లించాలంటూ ఐసీసీ తీర్పునిచ్చింది. 
Read Also : ధోనీ గద్దలా: మరోసారి అభిమానితో పరుగుపందెం