BCCI: బీసీసీఐ బీజేపీ చేతుల్లోనే ఉందంటోన్న పీసీబీ మాజీ చైర్మన్

బీజేపీనే బీసీసీఐపై నిజమైన నియంత్రణతో వ్యవహరిస్తుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి ఆరోపించారు. క్రికెట్ పాకిస్తాన్‌తో సంభాషణలో ఈ విషయాన్ని వెల్లడించారు.

BCCI: బీసీసీఐ బీజేపీ చేతుల్లోనే ఉందంటోన్న పీసీబీ మాజీ చైర్మన్

Bcci

BCCI: బీజేపీనే బీసీసీఐపై నిజమైన నియంత్రణతో వ్యవహరిస్తుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి ఆరోపించారు. క్రికెట్ పాకిస్తాన్‌తో సంభాషణలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదే విషయమై మణి మాట్లాడుతూ.. బీసీసీఐపై బీజేపీ ప్రభావం వల్లనే పాకిస్తాన్‌తో బంధాన్ని కొనసాగించడం ఇష్టం లేదని వ్యాఖ్యానించారు.

“బీసీసీఐకి సౌరవ్ గంగూలీ ఉన్నప్పటికీ, ఆ బోర్డు కార్యదర్శి ఎవరని ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? అమిత్ షా కుమారుడు జై షా. బీసీసీఐ కోశాధికారి బీజేపీ మంత్రి సోదరుడు. అలా బీసీసీఐ నిజమైన నియంత్రణ బీజేపీ వద్దే పెట్టుకుని.. వారి పనులను నిర్దేశిస్తుంది. అందుకే వారితో సంబంధాలను కొనసాగించలేదు. నేనెప్పుడూ వారిని తిరస్కరించలేదు కానీ మా సమగ్రతను త్యాగం చేయదలచుకోలేదు కూడా” అని ఎహ్సాన్ మణి అంటున్నారు.

అన్ని ప్రధాన ICC ఈవెంట్‌లలో ఇండియా & పాకిస్థాన్ ఒకరికొకరు చెల్లింపులు జరుపుతూనే ఉన్నాయి. ఇటీవల రమీజ్ రజా భారత్ – పాకిస్తాన్ – ఆస్ట్రేలియా మధ్య ముక్కోణపు సిరీస్ ఆలోచనను ఐసీసీ మీదకు నెట్టడానికి ప్రయత్నించాడు. దానిని కౌన్సిల్ సున్నితంగా తిరస్కరించింది.