బీసీసీఐ కామెంట్: ఆస్ట్రేలియా క్రికెట్ బ్లాక్ మెయిల్ చేస్తుంది

బీసీసీఐ కామెంట్: ఆస్ట్రేలియా క్రికెట్ బ్లాక్ మెయిల్ చేస్తుంది

బీసీసీఐ.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మే6 నుంచి మే11వరకూ మహిళా ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే దేశీ ప్లేయర్లతో పాటు విదేశీ క్రికెటర్లను కలిపి 3 జట్లను ఏప్రిల్ 26 శుక్రవారం ప్రకటించింది. వీరిలో ఆస్ట్రేలియా నుంచి 3మహిళా క్రికెటర్లను మ్యాచ్‌లు ఆడవద్దంటూ క్రికెట్ ఆస్ట్రేలియా అడ్డుకుంది. 

దానికి కారణం.. ఆస్ట్రేలియా పురుషుల జట్టుతో ఆడటానికి బీసీసీఐ తన షెడ్యూల్ మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చిందట. దానికి నిరాకరించడంతో తమ దేశ మహిళా క్రికెటర్లని ఆడనివ్వమని ఆదేశిలిచ్చిందట. వరల్డ్ కప్ అనంతరం జనవరి 2020లో ఆస్ట్రేలియా పురుషుల జట్టుతో ఇండియన్ మెన్స్ జట్టు తలపడాల్సి ఉంది. దీనిని వాయిదా వేయాలనే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అడుగుతుండగా బీసీసీఐ నిరాకరిస్తుంది. 

‘ఏప్రిల్ 5 నుంచి ఆస్ట్రేలియా క్రికెట్‌‌ మాకు మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు వాళ్లు చేసిన మెయిల్ కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. పురుషుల క్రికెట్ వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయా అనేదానిపై బీసీసీఐ సీఈవోతో కలిసి చర్చిస్తాం. పురుషుల క్రికెట్‌ను మహిళా క్రికెట్‌కు లింక్ చేసి ఇలా చేయడమనేది హేయమైన చర్య’ అని బీసీసీఐ అధికార ప్రతినిధి తెలిపారు.