ఐపీఎల్ నష్టం రూ. 2200కోట్లు.. లెక్కలు ఇవే!

ఐపీఎల్ నష్టం రూ. 2200కోట్లు.. లెక్కలు ఇవే!

Bcci Set To Incur Losses Of Over Rs 2000 Crore Due To Ipl 2021

కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ నిరవధికంగా వాయిదా పడింది. ఈ టోర్నమెంట్ వాయిదాతో, ప్రసారం మరియు స్పాన్సర్‌షిప్‌ ఖర్చుల రూపంలో BCCI రూ .2వేల కోట్లకు పైగా నష్టాన్ని భరించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. బిసిసిఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, “ఈ సీజన్ వాయిదా వేయడం వలన, 2వేల నుంచి 2వేల 500 కోట్ల రూపాయల వరకు నష్టపోవచ్చు అని చెబుతున్నారు.

రూ.2200 కోట్లు ఖచ్చితంగా నష్టపోతుందని అంటున్నారు. ముఖ్యంగా “ఈ టోర్నమెంట్ 52 రోజుల్లో 60 మ్యాచ్‌లు ఆడవలసి ఉండగా.. మే 30వ తేదీన అహ్మదాబాద్‌లో మ్యాచ్‌లు ముగియవలసి ఉంది. 24 రోజుల్లో 29 మ్యాచ్‌లు మాత్రమే ఆడగా.. టోర్నమెంట్ వాయిదా వేయవలసి వచ్చింది. అయితే మ్యాచ్‌లు ఎప్పుడు జరుగుతాయో ఇప్పటివరకు ఓ అంచనా లేదు.. అసలు జరుగుతాయనే నమ్మకం కూడా లేదు. ఇటువంటి పరిస్థితిలో రద్దు అయితే మాత్రం బీసీసీఐ భారీగా నష్టపోతుంది.

టోర్నమెంట్ ప్రసార హక్కుల కోసం స్టార్ స్పోర్ట్స్ నుంచి అందుకునే మొత్తంలో బిసిసిఐకి గరిష్ట నష్టం వస్తుంది. స్టార్ ఐదేళ్ల ఒప్పందం విలువ రూ.16,347 కోట్లు, ఇది సంవత్సరానికి సుమారు 3269.4 కోట్ల రూపాయలు. ఒక సీజన్‌లో 60 ఆటలు ఆడితే, ఒక్కో మ్యాచ్‌కు 54.5 కోట్లు. 29 మ్యాచ్‌ల మొత్తం రూ .1580 కోట్లు, అటువంటి పరిస్థితిలో బోర్డు రూ .1690 కోట్ల నష్టాన్ని చవిచూస్తుంది.

స్పాన్సర్‌షిప్‌లో సగమే..
మొబైల్ తయారీదారు వివో ఈ టోర్నమెంట్ టైటిల్ స్పాన్సర్‌గా సీజన్‌కు రూ .440 కోట్లు చెల్లిస్తుంది. ఐపీఎల్‌ వాయిదా వేయడంతో బీసీసీఐకి సగం కంటే తక్కువ మొత్తం వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు, యునాకాడమీ, డ్రీమ్ 11, సీ రెడ్, అప్‌స్టాక్స్ మరియు టాటా మోటార్స్ వంటి కొన్ని అనుబంధ స్పాన్సరింగ్ కంపెనీలు ఉన్నాయి. అన్ని చెల్లింపులు సగం లేదా కొద్దిగా తగ్గించినట్లయితే, 2200 కోట్ల నష్టం ఉంటుంది. టోర్నమెంట్‌ను నిలిపివేయడం వల్ల ప్రతి ఫ్రాంచైజీకి ఎంత నష్టం వస్తుందో మాత్రం అధికారి చెప్పలేదు.