BCCI Spectators: గుడ్ న్యూస్.. వెస్టిండీస్‌తో మూడో టీ20కి ప్రేక్షకులకు అనుమతి

భారత్, వెస్టిండీస్ మధ్య ఫిబ్రవరి 20వ తేదీన జరగనున్న మూడో T20 మ్యాచ్ కోసం ఈడెన్ గార్డెన్స్‌లోకి 20వేల మంది ప్రేక్షకులను అనుమతించాలని భారత క్రికెట్ బోర్డు (BCCI) నిర్ణయించింది.

BCCI Spectators: గుడ్ న్యూస్.. వెస్టిండీస్‌తో మూడో టీ20కి ప్రేక్షకులకు అనుమతి

Bcci

BCCI Spectators: భారత్, వెస్టిండీస్ మధ్య ఫిబ్రవరి 20వ తేదీన జరగనున్న మూడో T20 మ్యాచ్ కోసం ఈడెన్ గార్డెన్స్‌లోకి 20వేల మంది ప్రేక్షకులను అనుమతించాలని భారత క్రికెట్ బోర్డు(BCCI) నిర్ణయించింది. వీరిలో ఎక్కువ మంది క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(CAB)లో సభ్యులుగా ఉన్నట్లు సమాచారం.

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ చీఫ్ అవిషేక్ దాల్మియాకు పంపిన ఇమెయిల్‌లో, “మీ అభ్యర్థన మేరకు, వెస్టిండీస్‌తో జరిగే చివరి టీ20 మ్యాచ్‌కి ప్రేక్షకులను అనుమతించాలని, ఆఫీస్ బేరర్‌లతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం” అని తెలిపారు. అయితే, దాల్మియా 70 శాతం ప్రేక్షకులను అనుమతించాలని అభ్యర్థించారు.

దీనికి సంబంధించి, CAB దాని సభ్యులకు చెల్లుబాటు అయ్యే యూనిట్లకు ఫ్రీ టిక్కెట్లను జారీ చేయబోతుంది. బీసీసీఐకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని దాల్మియా వెల్లడించారు. అంతకుముందు, గంగూలీ వార్తా సంస్థ PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆటగాళ్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రేక్షకులను లోపలికి అనుమతించడానికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.