స్టేడియంలో తేనెటీగల దాడి: ఆగిన మ్యాచ్

తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. భారత్-ఏ, ఇంగ్లాండ్ లయన్స్ జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ సాగుతోంది. ప్రేక్షకులంతా మ్యాచ్ ఏ మలుపు తిరుగుతుందాని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Published By: sreehari ,Published On : January 30, 2019 / 01:11 PM IST
స్టేడియంలో తేనెటీగల దాడి: ఆగిన మ్యాచ్

తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. భారత్-ఏ, ఇంగ్లాండ్ లయన్స్ జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ సాగుతోంది. ప్రేక్షకులంతా మ్యాచ్ ఏ మలుపు తిరుగుతుందాని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కేరళలోని తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. భారత్-ఏ, ఇంగ్లాండ్ లయన్స్ జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ సాగుతోంది. ప్రేక్షకులంతా మ్యాచ్ ఏ మలుపు తిరుగుతుందాని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా కేకలు.. ఆకస్మాత్తుగా స్టేడియంలో ప్రేక్షకులు, క్రికెటర్లంతా పరుగులు తీశారు. వర్షం అనుకున్నారా? బాంబు బెదిరింపు అనుకున్నారా? కానే కాదు.. తేనెటీగలు.. అవును. తేనెటీగల దండు.. ఒక్కసారిగా స్టేడియాన్ని చుట్టుముట్టాయి. 

కనిపించిన వాళ్లను వెంబడిస్తూ పదునైన ముళ్లతో కుట్టి దాడి చేశాయి. తేనెటీగల దెబ్బకు స్టేడియం అంతా ఖాళీ అయింది. కొందరు క్రికెట్ ప్రేక్షకులకు తీవ్ర గాయాలయ్యాయి. తేనెటీగల దెబ్బకు మ్యాచ్ కూడా 15 నిమిషాల పాటు ఆగిపోయింది. మ్యాచ్ లో 28వ ఓవర్ సమయంలో తేనెటీగల దండు దాడి చేసింది. అయితే అదృష్టవశాత్తూ మైదానంలోకి ఈ తేనెటీగలు వెళ్లకపోవడంతో క్రికెటర్లు ఎవరికి గాయాలు కాలేదు.

తేనెటీగలు దాడిచేసిన సమయంలో భారత్ ఏ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్టేడియంలో నడుస్తున్నాడు. అప్రమత్తమైన ద్రవిడ్ వెంటనే అక్కడి నుంచి దౌడ్ తీయడంతో సురక్షితంగా బయటపడ్డాడు. ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొన్న ప్రేక్షకులపైనే తేనెటీగలు దాడిచేశాయి. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో..