INDvsSL: రెండో టెస్టు జరిగిన స్టేడియం అంత దారుణమా..

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇండియా, శ్రీలంకల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ముగిసింది. రీసెంట్ గా దీనిపై రేటింగ్ ఇచ్చిన ఐసీసీ.. యావరేజ్ కంటే తక్కువ స్థాయిలో ఉందంటూ తీసిపారే

INDvsSL: రెండో టెస్టు జరిగిన స్టేడియం అంత దారుణమా..

Bangalore Pitch

INDvsSL: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇండియా, శ్రీలంకల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ముగిసింది. రీసెంట్ గా దీనిపై రేటింగ్ ఇచ్చిన ఐసీసీ.. యావరేజ్ కంటే తక్కువ స్థాయిలో ఉందంటూ తీసిపారేసింది. ఈ టెస్టు మ్యాచ్ లో ఇండియా.. ప్రత్యర్థి జట్టు శ్రీలంకను దారుణంగా 238పరుగులు తేడాతో ఓడించి చిత్తు చేసింది.

మార్చి 12న మొదలైన ఈ మ్యాచ్ మూడు రోజుల పాటు జరిగింది. ఈ వేదిక ఐసీసీ నుంచి డీమెరిట్ పాయింట్ దక్కించుకుంది.

‘పిచ్ మీద టర్న్ ఎక్కువగా ఉంది. తొలి రోజు నుంచే ఉన్న ఈ స్వభావం ఇన్నింగ్స్ మారేకొద్దీ పెరిగిపోయింది. బ్యాట్ కు బాల్ కు మధ్య పొంతన లేకుండా పోయింది’ అని మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. ఇదే రిపోర్ట్ ను బీసీసీఐకి కూడా ఫార్వార్డ్ చేశారు.

Read Also : గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియా అమ్మాయికి ఇంగ్లండ్ ఫ్యాన్ ప్రపోజ్..ముద్దులు హగ్గులు

2017లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత బెంగళూరు మైదానాన్ని పరీక్షించిన ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బోర్డ్.. టెస్టు చేసి యావరేజ్ కంటే తక్కువగా ఉందంటూ రేటింగ్ ఇచ్చాడు.

జనవరి 4, 2018న ప్రవేశపెట్టిన ICC గైడ్ లైన్స్ ప్రకారం.. “ఒక పిచ్ లేదా అవుట్‌ఫీల్డ్ నాణ్యత లేనిదిగా రేటింగ్ కు గురైతే ఆ వేదికకు అనేక డీమెరిట్ పాయింట్లు కేటాయించాలి.

మ్యాచ్ రిఫరీలు పిచ్‌లు సగటు కంటే తక్కువగా రేట్ చేస్తే.. వాటికి ఒక డీమెరిట్ పాయింట్ ఇస్తారు. పిచ్‌లు పేలవంగా, అనర్హమైనవిగా గుర్తిస్తే.. వేదికలకు వరుసగా మూడు, ఐదు డీమెరిట్ పాయింట్లు ఇచ్చేస్తారు. ఔట్‌ఫీల్డ్ సగటు కంటే తక్కువగా రేట్ చేయబడినప్పుడు ఎటువంటి డీమెరిట్ పాయింట్ ఇవ్వరు. అవుట్‌ఫీల్డ్‌లు పేలవంగా, అనర్హమైనవిగా గుర్తిస్తే.. వేదికలకు వరుసగా రెండు, ఐదు డీమెరిట్ పాయింట్లు ఇస్తారు.

ఒక వేదిక 12 నెలల కాలంలోనే ఐదు డీమెరిట్ పాయింట్లను దాటితే ఏ అంతర్జాతీయ క్రికెట్‌ను నిర్వహించకుండా సస్పెండ్ చేస్తామని ICC తెలిపింది.