దేశం కోసం, కదిలిస్తున్న సిరాజ్ నిర్ణయం

  • Published By: madhu ,Published On : November 22, 2020 / 04:08 AM IST
దేశం కోసం, కదిలిస్తున్న సిరాజ్ నిర్ణయం

Bereaved Mohammed Siraj : తండ్రి అంత్యక్రియల విషయంలో టీమిండియా పేస్ మహ్మద్ సిరాజ్ తీసుకున్న నిర్ణయం అందరినీ కదిలిస్తోంది. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని స్థితిలోనూ దేశం కోసం ఆడాలని నిర్ణయం తీసుకున్నారు. సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ (53) మృతి చెందిన సంగతి తెలిసిందే. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఫేస్ బౌలర్ సిరాజ్ ను హైదరాబాద్ కు పంపించేందుకు బీసీసీఐ సన్నద్ధమైంది. కానీ..అతను అంగీకరించలేదు.



టూర్ మధ్యలో వెనక్కి రాకుండా..సిడ్నీలోనే ఉండిపోవాలని అతను నిర్ణయించుకున్నాడని బోర్డు వెల్లడించింది. తండ్రి మరణవార్త అనంతరం సిరాజ్ తో బీసీసీఐ అధికారులు మాట్లాడారు. ఇలాంటి సమయంలో భారత్ కు తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ కు వెళ్లకుండా..ఆస్ట్రేలియాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారని, జట్టుతో పాటు ప్రాక్టీస్ కొనసాగిస్తానని చెప్పాడన్నారు.



అతని బాధను పంచుకుంటూ..బోర్డు ఈ స్థితిలో సిరాజ్ కు అండగా నిలుస్తుందని బీసీసీఐ ప్రకటించింది. ఈ బాధను అధిగమించే శక్తి అతనికిప్పుడు కావాలని, ఆసీస్ పర్యటనలో అతను రాణించాలని కోరుకుంటున్నట్లు బోర్డు అధ్యక్షుడు గంగూలీ వెల్లడించారు. భారత్ తరపున 1 వన్డే, 3 టీ 20 లు ఆడిన సిరాజ్ ఇప్పటి వరకు టెస్టుల్లో అరంగ్రేటం చేయలేదు. ఆసీస్ పర్యటనలో అతను టెస్టు సిరీస్ కు ఎంపికైన సంగతి తెలిసిందే.



సిరాజ్ భారత క్రికేటర్ గా ఎదగడంలో తండ్రి మహ్మద్ గౌజ్ కీలక పాత్ర పోషించారు. ఆటో డ్రైవర్ గా కుటుంబాన్ని పోషిస్తూ..సిరాజ్ కలను నెరవేర్చాడు. ఐపీఎల్ హైదరాబాద్ జట్టు రూ. 2.6 కోట్లకు సొంతం చేసుకోవడంతో సిరాజ్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. భారత్ ఏ జట్టులో ప్లేస్ సంపాదించుకున్నాడు. నిలకడమైన ఆట తీరు కనబరుస్తూ..టీమిండియాకు ఎంపికయ్యాడు. ఇటీవలే కోల్ కతాలో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు తరపున సిరాజ్ ఆడాడు. మంచి ఆటతీరు కనబర్చాడు. రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన సిరాజ్…తొలి బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ఒక్క పరుగు ఇవ్వకుండా..మూడు వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్రకెక్కాడు.