Jasprit Bumrah : టీమిండియాకు బిగ్ షాక్..? టీ20 వరల్డ్ కప్‌కు ఆ స్టార్ బౌలర్ దూరం..?

టీ20 వరల్డ్ కప్ కు ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచ కప్ కు దూరం కానున్నాడని నివేదికలు చెబుతున్నాయి. గాయం కారణంగా స్టార్ పేసర్ బుమ్రా ఇప్పటికే ఆసియా కప్ కు దూరమయ్యాడు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లో కూడా బుమ్రా పాల్గొనడం అనుమానంగా మారిందని నివేదికలు చెబుతున్నాయి.

Jasprit Bumrah : టీమిండియాకు బిగ్ షాక్..? టీ20 వరల్డ్ కప్‌కు ఆ స్టార్ బౌలర్ దూరం..?

Jasprit Bumrah : టీ20 వరల్డ్ కప్ కు ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచ కప్ కు దూరం కానున్నాడని నివేదికలు చెబుతున్నాయి. గాయం కారణంగా స్టార్ పేసర్ బుమ్రా ఇప్పటికే ఆసియా కప్ కు దూరమయ్యాడు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లో కూడా బుమ్రా పాల్గొనడం అనుమానంగా మారిందని నివేదికలు చెబుతున్నాయి.

గతంలోని గాయం తిరగబెట్టడంతో బుమ్రా తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఎన్సీఏలో ఉన్నాడు. ఇక టీ20 వరల్డ్ కప్ కు జట్టును ప్రకటించడానికి ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బుమ్రా గాయం బీసీసీఐని ఆందోళనకు గురి చేస్తోంది.

గాయం కారణంగానే బుమ్రాను ఆసియా కప్ కు ఎంపిక చేయలేదు. 2019లో బుమ్రాకు బ్యాక్ ఇంజ్యూరీ అయ్యింది. ఆ గాయం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.

‘బుమ్రా ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమ వైద్య సలహాను పొందుతాడు. సమస్య ఏమిటంటే ఇది అతని పాత గాయం. ప్రపంచ కప్‌కు మాకు కేవలం రెండు నెలల సమయం మాత్రమే మిగిలుంది. అతని పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. అతను క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్’ అని బీసీసీఐ సీనియర్ అధికారి అన్నారు.

బుమ్రా గాయం అతన్ని మళ్లీ మళ్లీ ఎందుకు వెంటాడుతోంది?
బుమ్రా విచిత్రమైన బౌలింగ్ చర్యను కలిగి ఉన్నాడు. అతని బౌలింగ్ చర్యే అతని దిగువ వీపుపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ కారణంగానే అతను తరచుగా వెన్నునొప్పితో బాధపడటం జరుగుతోంది. బుమ్రా టీ20 ప్రపంచకప్‌కు దూరమైతే భారత క్రికెట్ జట్టుకు బ్యాడ్ న్యూసే. భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్ లేదా అర్ష్‌దీప్ సింగ్‌తో కలిసి భారత్ వెళ్లాల్సి ఉంటుంది. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసేటప్పుడు హర్షల్, భువీ నిష్ణాతులు, అయితే భారత్‌కు ముందుగా వికెట్లు తీయడానికి ఎవరైనా కావాలి అంటే అది జస్ప్రీత్ బుమ్రా లాంటి వారే కావాలి. ఒకవేళ బుమ్రా తప్పితే, పవర్‌ ప్లేలో బౌలింగ్ చేయగల షమీ లాంటి బౌలర్ ని భారత్ ఖచ్చితంగా చూస్తుంది.

“షమీకి వయసు పెరుగుతోంది. అతనిపై అధిక భారాన్ని మోపలేము. అందుకే టీ20ల గురించి అతడికి సమాచారం ఇవ్వడం లేదు. కానీ మనకు ఇద్దరు ప్రీమియర్ పేసర్లు గాయపడితే, మేము ఆస్ట్రేలియాలో నమ్మకమైన వారిని చూసుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాలోని పిచ్ పరిస్థితులు షమీకి బాగా తెలుసు. అతడు జట్టుకు గొప్ప ఆస్తి కావచ్చు. కానీ అతని ఎంపికపై నిర్ణయం చివరి దశలో మాత్రమే తీసుకోబడుతుంది” అని సెలక్షన్ కమిటీ సభ్యుడు ఒకరు చెప్పారు.

 

గాయంతో బాధపడుతున్న బుమ్రా…