New Jersey: టీ20 ప్రపంచ కప్ కోసం కొత్త జెర్సీలో టీమిండియా

అక్టోబర్ 17వ తేదీ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE), ఒమన్‌లలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా కొత్త జెర్సీని విడుదల చేసింది.

New Jersey: టీ20 ప్రపంచ కప్ కోసం కొత్త జెర్సీలో టీమిండియా

Jersey

Billion Cheers Jersey: అక్టోబర్ 17వ తేదీ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE), ఒమన్‌లలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా కొత్త జెర్సీని విడుదల చేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఈమేరకు ఓ ట్వీట్ చేసి విషయాన్ని వెల్లడించింది. కొత్త జెర్సీని అభిమానులతో పంచుకున్న బీసీసీఐ ట్వీట్‌లో ‘బిలియన్ చీర్స్ జెర్సీ(Billion Cheers Jersey)”ని పరిచయం చేసింది.

టీమిండియా కొత్త జెర్సీ, పాత జెర్సీకి కాస్త విభిన్నంగా కనిపిస్తుంది. భారత జట్టు ఇప్పటివరకు ధరించిన జెర్సీ ముదురు నీలం రంగులో ఉండగా.. ఈ జెర్సీ కూడా అదే రంగులో కనిపిస్తుంది. కానీ దాని డిజైన్ మాత్రం వేరేగా ఉంది. మధ్యలో లేత నీలం రంగు గీతు కూడా కనిపిస్తున్నాయి. అంతకుముందు జెర్సీలో భుజంపై త్రివర్ణ పతాకం ఉండేది. ఇప్పుడు ఈ జెర్సీ భుజంపై ఎలాంటి డిజైన్ కనిపించట్లేదు.

MPL స్పోర్ట్స్ చెప్పిన వివరాల ప్రకారం.. భారత చరిత్రలో అభిమానుల భావోద్వేగాలను జెర్సీపై కనిపించేలా విలక్షణమైన ‘సౌండ్ వేవ్’ నమూనాను జెర్సీలో పెట్టారు. ఈ జెర్సీలో ముదురు నీలం రంగులో రెండు ‘షేడ్స్’ కూడా కనిపిస్తున్నాయి.

ఈ జెర్సీతో టోర్నమెంట్‌లో అడుగుపెట్టి, టీ20 ప్రపంచకప్‌ను కచ్చితంగా భారత్‌కు తీసుకుని వస్తారనే నమ్మకం ఉందంటూ బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ కూడా అభిప్రాయపడ్డారు. బీసీసీఐ చేసిన ట్వీట్‌లో ఫోటోలో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవింద్ర జడేజా, బుమ్రా కనిపిస్తున్నారు.