Brendan Taylor : మ్యాచ్ ఫిక్సింగ్.. ఆ భారతీయ వ్యాపారవేత్త బెదిరించాడు.. బయటపెట్టిన మాజీ క్రికెటర్!

జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టాడు.

Brendan Taylor : మ్యాచ్ ఫిక్సింగ్.. ఆ భారతీయ వ్యాపారవేత్త బెదిరించాడు.. బయటపెట్టిన మాజీ క్రికెటర్!

Brendan Taylor

Brendan Taylor : జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టాడు. ఒక భారతీయ వ్యాపారవేత్త అవినీతి విధానాన్ని బయటపెట్టడంలో విఫలమైనందుకు ICC నుంచి ఏళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకానొక సమయంలో మూర్ఖంగా కొకైన్ తీసుకున్న తనను ఆ వ్యాపారవేత్త బ్లాక్ మెయిల్ చేశాడని టేలర్ వెల్లడించాడు. 2019 అక్టోబర్‌లో

మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని తనను బెదిరించాడని, అందుకు 15,000 అమెరికన్ డాలర్ల ఆఫర్‌ కూడా ఇచ్చినట్టు ట్విట్టర్ వేదికగా ఆరోపించాడు. జింబాబ్వేలో T20 ఈవెంట్‌కు సంబంధించి గురించి చర్చించడానికి వ్యాపారవేత్త తనను ఇండియాకు ఆహ్వానించినట్లు సోషల్ మీడియాలో టేలర్ చెప్పుకొచ్చాడు. ఇంతకీ బెదిరించిన ఆ భారతీయ వ్యాపారవేత్త ఎవరు అనేది మాత్రం టేలర్ బయటకు రివీల్ చేయలేదు. జింబాబ్వే తరఫున ఆడిన దేశ మాజీ కెప్టెన్‌ బ్రెండన్ టేలర్.. అత్యధిక సెంచరీలు(17) బాదిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.. ఆనాటి ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా తాను ఆ వ్యక్తి నుంచి కొద్ది మొత్తంలో నగదు కూడా తీసుకున్నట్టు వెల్లడించాడు.

గతేడాది సెప్టెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు టేలర్‌ వీడ్కోలు పలికాడు. అయితే తాను భారత్ కు వచ్చిన సమయంలో ఓ పార్టీలో కొందరు తనకు కొకైన్‌ ఆఫర్‌ చేసినట్టు తెలిపాడు. ఆ సమయంలో తాను కొకైన్‌ తీసుకుంటుండగా ఎవరో వీడియోలు తీసి బెదిరించారని వాపోయాడు. అప్పుడే తనను మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేయమన్నారని బెదిరించారని అసలు నిజాన్ని బయటపెట్టాడు.


ఆ భారతీయ వ్యాపారవేత్త జింబాబ్వేలో టీ20 లీగ్‌ను లాంచ్‌ చేస్తామన్నాడని, అందుకు అతడు తనను సంప్రదించినట్టు తెలిపాడు. అప్పటికే తమ దేశ క్రికెట్ బోర్డు నుంచి 6 నెలలుగా జీతాలు లేవని అన్నాడు. తన ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలంటూ ప్రలోభాలకు గురిచేసినట్టు టేలర్ బయటపెట్టాడు.

ఎప్పటినుంచో ఈ విషయాన్ని తన మనసులోనే దాచుకుని మానసికంగా చాలా కృంగిపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడా ఆ భారాన్ని మొత్తం దించుకునేందుకు అప్పటి వాస్తవాలన్నీ బయటపెడుతున్నానని టేలర్ చెప్పుకొచ్చాడు. జింబాబ్వే తరఫున 34 టెస్టులు, 205 వన్డేలు, 45 టీ20 టేలర్ ఆడగా.. టెస్ట్‌ల్లో 6 సెంచరీలు, వన్డేల్లో 11 సెంచరీలతో పాటు 10వేల పరుగులు నమోదు చేశాడు. 35 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌.. 2014 ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు.

Read Also : Smriti Mandhana : స్మృతి మందానకు 2021 ఐసీసీ మహిళా క్రికెటర్ అవార్డు