బుమ్రా పెళ్లి ఎవరితో ? వధువు అనుపమ కాదట

బుమ్రా పెళ్లి ఎవరితో ? వధువు అనుపమ కాదట

Bumrah married

Bumrah married : టీమిండియా పేసర్ జాస్ప్రిత్ బుమ్రా పెళ్లి గురించి..రకరకాల వార్తలు వెలువడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ విషయంపై సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. పెళ్లి కోసమే..భారత్- ఇంగ్లండ్ నాలుగో టెస్టు మ్యాచ్ ఆడలేదని, బుమ్రా నిజంగానే పెళ్లి కోసమే సెలవులు పెట్టి వెళ్లాడని టాక్ వినిపించింది. బుమ్రా పెళ్లి చేసుకొనే అమ్మాయి ఎవరు అనే దానిపై చర్చించుకున్నారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పెళ్లి చేసుకుంటారని మాట్లాడుకోవడం ప్రారంభించారు. వీరిద్దరూ కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని పుకార్లు షికారు చేశాయి.

దీనికంతటికీ అనుపమ ఫ్యామిలీ చెక్ పెట్టింది. వారిద్దరూ ఫ్రెండ్స్ మాత్రమేనని స్వయంగా ఆమె తల్లి వెల్లడించింది. బుమ్రా, తమ కూతురు లవ్ లో ఉన్నారని ఇది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అయితే..అనుపమ తండ్రి క్రికెట్ కు బిగ్ ఫ్యాన్ అని, అందులో భాగంగా బుమ్రాను కలుసుకున్నారని తెలిపారు. క్రికెట్ అభిమానిగా కలిశారే తప్ప..మరే ఉద్దేశ్యం లేదన్నారు.

ఈ సమయంలో బుమ్రా బస చేసిన హోటల్ లో అనుపమ కూడా ఉండడం ఊహాగానాలు వెలువడ్డాయన్నారు. ఈ రూమర్లను తమ కుటుంబం అంత సీరియస్ గా తీసుకోలేదని అనుపమ తల్లి చెప్పడంతో మరెవరిని వివాహం చేసుకుంటాడనే చర్చ మొదలైంది. అప్పుడే స్టార్ స్పోర్స్ యాంకర్ సంజనా గణేషన్ పేరు తెరపైకి వచ్చింది. ఇందుకు ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకున్నాయని అంటున్నారు. అయితే..బుమ్రాను పెళ్లి చేసుకోబోతున్నానని వస్తున్న వార్తలపై ఆమె ఇప్పటి వరకు స్పందించలేదు. ఇంగ్లండ్ నాలుగో టెస్టు నుంచి ఎందుకు బయటకు వచ్చారు ? ఎవరిని పెళ్లి చేసుకుంటారనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.