మరోసారి పాక్ తో అప్పటి మ్యాచ్ గుర్తు చేసిన బుమ్రా

మరోసారి పాక్ తో అప్పటి మ్యాచ్ గుర్తు చేసిన బుమ్రా

హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడుతోన్న మ్యాచ్ లో ఆసీస్ 236 పరుగులు చేసింది. ఆరంభం నుంచి బ్యాట్స్ మెన్ ను కట్టడి చేస్తూ వచ్చిన భారత బౌలర్లు చివర్లో పట్టు కోల్పోయారు. జస్ప్రిత్ బుమ్రాను టార్గెట్ చేసిన ఆసీస్ బౌండరీలపై విరుచుకుపడింది. కొన్ని నెలల తర్వాత బుమ్రా ఇంత దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆర్థోడొక్స్ యాక్షన్ తో డబుల్ స్వింగ్ చేయగల బుమ్రా మూడు ఫార్మాట్లలోనూ తిరుగులేని బౌలర్ గా కొనసాగుతున్నా.. తొలి వన్డేలో పరుగులు భారీగా ఇవ్వడమేంటని నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు.

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ ను డక్ అవుట్ చేసి ఔరా అనిపించాడు. ఆ తర్వాత వేసిన 9 ఓవర్లలో 59 పరుగులిచ్చాడు. కేవలం బుమ్రా బౌలింగ్ లోనే 11 ఫోర్ బౌండరీలు వెళ్లాయి. ఉస్మాన్ ఖవాజా, గ్లెన్ మ్యాక్స్ వెల్ మధ్య కొద్దిపాటి భాగస్వామ్యమైనా నమోదైందంటే అది బుమ్రా వల్లే.

2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లోనూ ఇలాగే భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 10-0-60-2పరుగులతో చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. అయితే భారత పర్యటనలో భాగంగా ఆసీస్ ఆడిన తొలి టీ20లో 19వ ఓవర్ పరుగులు కట్టడి చేయడంతో పాటు 2 వికెట్లు తీసి ప్రశంసలు అందుకున్నాడు. ఆ ప్రదర్శనతో బుమ్రాపై పెరిగిన అంచనాలను నిలబెట్టుకోలేకపోయాడు.