Kidambi Srikanth : వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ ఓటమి

స్పెయిన్ లోని హుఎల్వా వేదికగా జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ ఓడిపోయాడు.

Kidambi Srikanth : వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ ఓటమి

Kidambi Srikanth

BWF World Championships 2021 Final : ఆశలు ఆవిరయ్యాయి. స్వర్ణం చేజారింది. ఆఖరి మెట్టుపై తడబడ్డాడు. భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ కు అదృష్టం కలిసిరాలేదు. స్పెయిన్ లోని హుఎల్వా వేదికగా జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్(28) ఓటమిపాలయ్యాడు. చాంపియన్ షిప్ ను తృటిలో చేజార్చుకున్నాడు. హోరాహోరీగా జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్స్ లో సింగపూర్ షట్లర్ కిన్ యూ చేతిలో శ్రీకాంత్ ఓటమి చవిచూశాడు. 15-21, 20-22 పాయింట్ల తేడాతో వరుస గేమ్ లు కోల్పోయాడు.

42 నిమిషాల పాటు హోరాహోరిగా సాగిన పోరులో శ్రీకాంత్ ను కిన్ ఓడించాడు. దేశానికి తొలి ప్రపంచ చాంపియన్ షిప్ ను గెలవాలన్న శ్రీకాంత్ ఆశలపై కిన్ నీళ్లు చల్లాడు. ఫైనల్లో హోరాహోరిగా పోరాడిన శ్రీకాంత్.. రెండో స్థానంతో సిల్వర్ మెడల్ గెలిచాడు. కిన్ యూ కెరీర్ లో తొలి టైటిల్.

Child Pornography : షాకింగ్.. టీచర్ దగ్గర లక్షలకొద్దీ చిన్నారుల నీలి చిత్రాలు, వీడియోలు.. అరెస్ట్

కాగా, ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్ చేరిన తొలి భారత పురుష షట్లర్ గా శ్రీకాంత చరిత్ర సృష్టించాడు. అయితే ఫైనల్లో శ్రీకాంత్ ఓటమి అభిమానులను నిరాశకు గురి చేసింది. ఫైనల్లో ఓటమితో కిదాంబి శ్రీకాంత్ కు రజతం దక్కింది. గతంలో ప్రకాశ్ పదుకొనె (1983), సాయి ప్రణీత్ (2019) కాంస్యం గెలిచారు. ఇక లక్ష్య సేన్(2021) కూడా కాంస్యం దక్కించుకున్నాడు. సెమీస్ లో లక్ష్య సేన్ తో తలపడిన శ్రీకాంత్ అతడి ఓడించి ఫైనల్ కి చేరాడు. అయితే, టైటిల్ విజేతగా నిలవలేకపోయాడు. ప్రపంచ చాంపియన్ షిప్ లో ఒకేసారి ఇద్దరు భారత ఆటగాళ్లకు(శ్రీకాంత్, లక్ష్యసేన్) పతకాలు రావడం విశేషం.

Dog Killer Monkeys : హమ్మయ్య.. కిల్లర్ కోతులు చిక్కాయి.. ప్రతీకారంతో 250 కుక్కలను హత్య చేసిన ఆ రెండు వానరాలను బంధించారు

తుది పోరులో తొలి సెట్ లో శ్రీకాంత్ పై కిన్ ఆధిపత్యం చెలాయించాడు. ఆట ఆరంభం నుంచే శ్రీకాంత్ పై ధాటిగా ఆడిన కిన్.. అతడికి కోలుకునే ఛాన్స్ ఇవ్వలేదు. కానీ రెండో గేమ్ లో శ్రీకాంత్ పుంజుకున్నాడు. కిన్ తో హోరాహోరిగా పోరాడాడు. ఓ దశలో గేమ్ మూడో సెట్ కు వెళ్తుందా..? అనిపించినా కిన్ మాత్రం అందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ ఇద్దరూ 2018లో ఒకసారి తలపడ్డారు. ఆ తర్వాత ఇదే మళ్లీ. ఈ గెలుపుతో కిన్ చరిత్ర సృష్టించాడు. సింగపూర్ నుంచి బీడబ్ల్యూఎఫ్ లో నెగ్గిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

గతంలో కిన్ ను వరుస గేముల్లో ఓడించిన అనుభవం శ్రీకాంత్ కి ఉంది. 2018 కామన్ వెల్త్ పోటీల్లో వరుస గేముల్లో ఓడించాడు. అయితే అప్పటికి ఇప్పటికి కిన్ ఆటలో ఎంతో మార్పు కనిపించింది. ఈ టోర్నీలో ఒలింపిక్ విజేత, ప్రపంచ నెంబర్ వన్ విక్టర్ అక్సెల్ సెన్ ను కిన్ ఓడించాడు.

ప్రపంచ చాంపియన్ షిప్ ఫైనల్లో ఓడినా.. శ్రీకాంత్ అరుదైన ఘనత సాధించాడు. బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్ కు చేరడమే కాక రజత పతకం కూడా నెగ్గిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మొత్తంగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ చరిత్రలో సింగిల్స్ విభాగంలో ఫైనల్ కు చేరిన మూడో ఆటగాడు శ్రీకాంతే. గతంలో తెలుగు క్రీడాకారిణి పీవీ సింధు మూడు సార్లు.. మరో హైదరాబాదీ సైనా నెహ్వాల్ ఓసారి ఫైనల్ కు చేరారు. కానీ పురుషుల సింగిల్స్ లో మాత్రం ఫైనల్ కు చేరింది శ్రీకాంత్ ఒక్కడే.

మెన్స్ సింగిల్స్‌లో భారత్ కు పతకాలు సాధించింది వీరే..
* కిదాంబి శ్రీకాంత్ (సిల్వర్ మెడల్-2021)
* ప్రకాశ్ పదుకొనె (కాంస్య పతకం-1983)
* బి.సాయి ప్రణీత్ (కాంస్యం-2019)
* లక్ష్య సేన్ (కాంస్యం-2021)