BWF World Championships : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్…క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌

తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లింది. స్పెయిన్ వేదికగా ఈ క్రీడా పోటీలు జరుగుతున్నాయి.

BWF World Championships : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్…క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌

Bwf Sindhu

PV Sindhu : ప్రపంచ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు కొనసాగుతున్నాయి. భారత క్రీడాకారులు రాణిస్తున్నారు. తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లింది. స్పెయిన్ వేదికగా ఈ క్రీడా పోటీలు జరుగుతున్నాయి. మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్ గురువారం జరిగింది. ప్రపంచ ఏడో ర్యాంకర్ గా కొనసాగుతున్న పి.వి.సింధు..పోర్న్ పవీ చొచువాంగ్ (థాయిలాండ్) క్రీడాకారిణి మధ్య పోటీ జరిగింది.

Read More : Today Gold Price : పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన బంగారం ధర

ఈ మ్యాచ్ లో ఆరంభం నుంచి సింధు అధిక్యం కనబరిచింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా…ఆటను కొనసాగించింది. తొలి గేమ్ అలవోకగా సింధు నెగ్గింది. కానీ..రెండో గేమ్ వచ్చే సరికి…చొచువాంగ్..అధిపత్యాన్ని కనబరిచింది. పదునైన స్మాష్ లతో సింధు రాణించడంతో విజయం సాధించింది. 21-14, 21-18తో చొచువాంగ్ పై సింధు గెలుపొందింది.

Read More : Bigg Boss 5 : బిగ్‌బాస్‌ లో ఏం జరుగుతుందో మీకు తెలీదు.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడకండి : యాని మాస్టర్

క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ తై జూ యింగ్‌ తో సింధు తలపడనుంది. మరోవైపు పురుషుల పోటీల్లో భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ కూడా క్వార్టర్స్ లోకి ప్రవేశించారు. 21-10, 21-15తో గాంగ్‌ జూ లూపై గెలుపొందాడు. అయితే..డబుల్స్ లో మాత్రం…నిరాశ ఎదురైంది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్ లో సిక్కిరెడ్డి – అశ్విని పొన్నప్పలు టోర్నీ నుంచి నిష్క్రమించారు.