Sourav Ganguly : అక్రమ భూకేటాయింపులు.. గంగూలీకి జరిమానా విధించిన కలకత్తా కోర్టు

గంగూలీకి అక్రమ పద్దతిలో భూ కేటాయింపు చేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టిన కోర్టు సోమవారం జరిమానా విధిస్తు తీర్పు వెల్లడించింది.

Sourav Ganguly : అక్రమ భూకేటాయింపులు.. గంగూలీకి జరిమానా విధించిన కలకత్తా కోర్టు

Sourav Ganguly

Sourav Ganguly : టీం ఇండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కలకత్తా హైకోర్టు జరిమానా విధించింది. గంగూలీకి అక్రమ పద్దతిలో భూ కేటాయింపు చేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టిన కోర్టు సోమవారం జరిమానా విధిస్తు తీర్పు వెల్లడించింది. కలకత్తా సమీపంలోని ఓ పాఠశాల భవన నిర్మాణం కోసం గంగూలీకి అక్రమ పద్దతిలో స్థలం కేటాయించినట్లుగా 2016లో ఈ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ అరిజిత్ బెనర్జీలతో కూడిన డివిజన్ బెంచ్,. అక్రమ కేటాయింపు వాస్తవమే అని తేల్చి రూ. 10 వేల జరిమానా విధించింది.

Read More : Navjot Singh Sidhu : పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి సిద్దూ రాజీనామా

ఈ భూమిని కేటాయించిన హౌసింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హిడ్కో)తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రూ.50 వేల చొప్పున జరిమానా వేసింది. ఉత్తర్వు కాపీ అందిన తేదీ నుంచి నాలుగు వారాల్లోగా ఆ మొత్తాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీలో జమ చేయాలని బెంచ్ ఆదేశించింది. WBHIDCO ద్వారా న్యూ టౌన్‌లో ప్లాట్లు కేటాయించడాన్ని సవాలు చేస్తూ 2016 లో దాఖలు చేసిన పిల్‌పై బెంచ్ ఈ ఉత్తర్వు జారీ చేసింది.

Read More : IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు డేవిడ్ వార్నర్ గుడ్‌బై