IND vs BAN: బంగ్లాతో జరిగే టెస్టు సిరీస్‌లో కూంబ్లే రికార్డును అశ్విన్ అధిగమించగలడా?

టెస్టు సిరీస్‌లో భారత్ వెటరన్ స్పిన్నర్ ఆర్. అశ్విన్ సరికొత్త రికార్డు సృష్టిస్తాడా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. బంగ్లాతో టెస్టు సిరీస్ లో కుంబ్లే రికార్డును బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయి. భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన 93వ టెస్టు మ్యాచ్‌లో 450 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అశ్విన్ 86 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. ప్రస్తుతం 442 వికెట్లు పడగొట్టాడు.

IND vs BAN: బంగ్లాతో జరిగే టెస్టు సిరీస్‌లో కూంబ్లే రికార్డును అశ్విన్ అధిగమించగలడా?

ravichandran ashwin

IND vs BAN: భారత్ – బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ డిసెంబర్ 14న (బుధవారం) ప్రారంభంకానుంది. ఈ టెస్టు సిరీస్‌కు ఇరు జట్లు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాయి. వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా టెస్ట్ సిరీస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే ఈ సిరీస్ కు రోహిత్ శర్మ, షమీ వంటి సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో లేరు. అధికశాతం యువజట్టుతోనే టీమిండియా బంగ్లాను టెస్టు సిరీస్ లో ఎదుర్కోనుంది.

India vs Bangladesh 3rd ODI: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. ఇంతకుముందు ఎవరెవరు చేశారంటే?

ఇదిలాఉంటే ఈ టెస్టు సిరీస్‌లో భారత్ వెటరన్ స్పిన్నర్ ఆర్. అశ్విన్ సరికొత్త రికార్డు సృష్టి‌స్తాడా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. బంగ్లాతో టెస్టు సిరీస్ లో కుంబ్లే రికార్డును బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయి. భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన 93వ టెస్టు మ్యాచ్‌లో 450 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అశ్విన్ 86 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. ప్రస్తుతం 442 వికెట్లు పడగొట్టాడు. మరో ఎనిమిది వికెట్లు తీస్తే కూంబ్లే రికార్డును అధిగమించడం అశ్విన్ కు సాధ్యమవుతుంది. ఎనిమిది వికెట్లు తీస్తే అతి తక్కువ టెస్టు మ్యాచ్‌లలో 450 టెస్ట్ వికెట్లు తీసిన స్పిన్ బౌలర్‌గా అశ్విన్ ఘనత సాధిస్తాడు.

Ravichandran Ashwin: మీ దుస్తులను ఇలాకూడా గుర్తుపట్టొచ్చు.. నవ్వులుపూయిస్తున్న క్రికెటర్ అశ్విన్ వీడియో ..

డిసెంబర్ 14 నుంచి 18 వరకు చిట్టగాంగ్ వేదికగా భారత్ – బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ జరుగుతుంది. కాగా రెండో టెస్ట్ డిసెంబర్ 22 నుంచి 26వ తేదీ వరకు ఢాకాలోని మిర్పూర్‌లోని షేర్ -ఏ- బంగ్లా స్టేడియంలో జరుగుతుంది.