IPL 2023: తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమిపై కెప్టెన్ ధోనీ కీలక వ్యాఖ్యలు ..
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. గైక్వాడ్ దూకుడుతో స్కోర్ 200 దాటుతుందని భావించినప్పటికీ గైక్వాడ్ (92) ఔట్ కావడం, మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించక పోవటంతో 178 పరుగులకే సీఎస్‌కే పరిమితమైంది.

IPL 2023
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో సీఎస్‌కే జట్టుకు పరాభవం ఎదురైంది. ఐదు వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో రుతురాజ్ గైక్వాడ్ (92) రాణించాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో చెన్నై 178/7 స్కోరు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ జట్టు శుభ్‌మన్ గిల్ (63) రాణించడంతో 19.2 ఓవర్లకే 182/5 స్కోరు చేసి విజయం సాధించింది.
IPL 2023, GT vs CSK: చెన్నైపై గుజరాత్ ఘన విజయం
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. గైక్వాడ్ దూకుడుతో స్కోర్ 200 దాటుతుందని భావించినప్పటికీ గైక్వాడ్ ఔట్ కావడం, మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించక పోవటంతో 178 పరుగులకే సీఎస్‌కే పరిమితమైంది. మరోవైపు బౌలింగ్ లోనూ సీఎస్‌కే బౌలర్లు పెద్దగా ఆకట్టుకోలేక పోయారు. తొలి మ్యాచ్ ఓటమిపై సీఎస్‌కే కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలుత బ్యాటింగ్ కాబట్టి మేము ఇంకాస్త పరుగులు చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
గైక్వాడ్ అద్భుతంగా ఆడాడని ప్రసంశించిన ధోనీ అనుకున్న స్థాయిలో ప్రత్యర్థి జట్టుకు టార్గెట్ నిర్దేశించలేక పోయామని అన్నారు. రుతురాజ్ గైక్వాడ్ కు తోడుగా మరో బ్యాట్స్‌మెన్ రాణించినా భారీ స్కోర్ నమోదయ్యేదని, కానీ తక్కువ స్కోర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ధోనీ తెలిపారు. బౌలింగ్ విభాగంలో ధోనీ సంతృప్తి వ్యక్తంచేశారు. బౌలర్ల మంచి ప్రదర్శన కనబర్చారని అన్నారు. అయితే, నోబాల్స్ అనేవి మన చేతుల్లోనే ఉంటాయి. వాటిని నియంత్రించడానికి బౌలర్లు మరికొంత సాధన చేయాల్సి ఉంటుందని అన్నారు.